హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించాడు. అయితే ఐసీసీ నిర్వాహకులు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఆశ్రయించి కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు రాబట్టారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
నిజానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఎలా పని చేస్తోంది అర్ధంకాక ఇప్పటికే ఎంతో మంది జట్లు పీక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఈ డక్‌వర్త్ లూయిస్ బారినపడి దక్షిణాఫ్రికా ఓ ఐసీసీ టోర్నీలో తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈ పద్ధతిలో అంపైర్ చెబితే తప్ప ఎన్ని పరుగులు చేయాలో ఎవరికీ తెలియదు.

ఇప్పటికే రెండు మ్యాచుల్లో టీమిండియా ఈ డక్‌వర్త్ లూయిస్ ప్రకారమే విజయాలు సాధించింది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో డక్‌వర్త్-లూయిస్ వల్ల కూడా ఫలితం తేలకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
సోమవారం లండన్‌లో జరిగిన కోహ్లీ డిన్నర్ కార్యక్రమంలో ధోనిని ఈ విషయంపై ప్రశ్నించగా, అతను ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. మీరు చాలా రోజుల నుంచి క్రికెట్‌ను ఫాలో అవుతున్నారు కదా.. మీకు డక్‌వర్త్ లూయిస్ అర్థమైందా? అని ధోనిని వ్యాఖ్యతగా ఉన్న ఐర్లాండ్ మాజీ జాతీయ క్రికెటర్ ప్రశ్నించాడు.
అంతేకాదు ఐసీసీకైనా ఈ పద్ధతి అర్థమవుతుందని నేను అనుకోవడం లేదు అని ధోని అన్నాడు. 'నేను అర్థం చేసుకోవడం సంగతి తర్వాత. నాకు తెలిసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా డక్‌వర్త్-లూయిస్ నిబంధన అర్థం కాదు' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియంలో నవ్వులు విరిశాయి.