Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీని తప్పుపట్టొద్దు: ఫీల్డింగ్ ఎంచుకోవడంపై గిల్‌క్రిస్ట్‌ ఇలా

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో టాస్ గెలిచిన కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడాన్ని తప్పుపట్టడానికి వీల్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చిన ది ఓవల్ స్టేడియం పిచ్ ప్లాట్ ట్రాక్ అని, కోహ్లీ ఎందుకు ఫీల్డింగ్ ఎంచుకున్నాడని సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ స్పందించాడు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నీ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌‌కు దిగడమే మంచిదని పేర్కొన్నాడు. పెర్త్ నుంచి ఢిల్లీకి వచ్చే ముందు టాస్ వేయడం చూశానని, పైనల్ లాంటి మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గితే బ్యాటింగ్‌కు దిగడం ఉత్తమమని అన్నాడు.

Champions Trophy 2017: Adam Gilchrist critical of Virat Kohli's decision to chase in final

'నేను పెర్త్‌ నుంచి ఢిల్లీకి వచ్చే ముందు టాస్‌ వేయడం చూశాను. ఆస్ట్రేలియా జట్టు కచ్చితంగా ఇలాంటి మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధిస్తుంది. కానీ ఛాంపియన్స్ టోర్నీలో ఎక్కువగా చేజింగ్‌ జట్లే విజయం సాధించాయి. అందుకే కోహ్లీ నిర్ణయాన్ని కూడా పూర్తిగా తప్పుపట్టడానికి లేదు' అని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు.

బుమ్రా బౌలింగ్‌లో ఫకార్ అవుటైన బంతి నో బాల్ కాకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని గిల్‌క్రిస్ట్‌ చెప్పాడు. ఫైనల్లో పాకిస్థాన్ అద్భుతమైన గేమ్ ఆడిందని, టోర్నీ మొత్తంలో టీమిండియా ప్రదర్శన కూడా బాగుందని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. పైనల్లో అలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+