Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముచ్చటగా మూడే రోజులు.. కోచ్ ప‌ద‌వికి చమిందా వాస్ రాజీనామా!!

Chaminda Vaas resigns as Sri Lankas fast bowling coach

కొలొంబో: నాటకీయమైన మలుపుల మధ్య శ్రీలంక పేస్ గ్రేట్ చమిందా వాస్‌ లంక జట్టు బౌలింగ్ కోచ్‌ పదవికి సోమవారం రాజీనామా చేశారు. మూడు రోజుల కింద‌ట‌ శ‌్రీలంక బౌలింగ్ కోచ్‌గా నియ‌మితుడైన వాస్‌.. ముచ్చటగా మూడు రోజులు కూడా కాకుండానే రాజీనామా చేయడం విశేషం. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ)తో వేతనం విష‌యంలో డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే శ్రీలంక టీమ్ వెస్టిండీస్ టూర్‌కు బ‌య‌లుదేరే ముందే వాస్ రాజీనామా చేయ‌డంపై ఎస్ఎల్‌సీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

'మేము చమిందా వాస్‌ నిబంధనలను అంగీకరించలేదు. అందుకే అతను రాజీనామా చేశాడు' అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి ఆర్థిక ప‌రిస్థితులు త‌ల‌కిందులైన స‌మ‌యంలో చమిందా వాస్ ఇలా చేయ‌డం స‌రికాద‌ని, అది కూడా జట్టు బ‌య‌లుదేరే కొన్ని గంటల ముందే రాజీనామా చేయ‌డం ఏంట‌ని లంక బోర్డు అధికారి ప్ర‌శ్నించారు.

ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టూర్‌ల‌లో టీమ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రీ దారుణంగా ఉంటంతో అప్ప‌టి వ‌ర‌కూ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ స‌క‌ర్‌ (ఆస్ట్రేలియా)ను తొల‌గించి గ‌త వార‌మే ఆ బాధ్య‌త‌లు చమిందా వాస్‌కు అప్ప‌గించింది లంక బోర్డు. సోమ‌వారం రాత్రి టీమ్‌తో క‌లిసి వాస్ వెస్టిండీస్‌కు పర్యటనకు వెళ్లాల్సింది. అయితే ఎస్ఎల్‌సీతో వేతనం విష‌యంలో డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో వాస్ కోచ్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. లెజెండ‌రీ బౌల‌ర్ ఉన్న‌ట్లుండి రాజీనామా చేయ‌డంపై లంక బోర్డు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అయితే సోమవారం రాత్రి బయలుదేరిన లంక జట్టుకు దేశ క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి లభించలేదు. టీ20 జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లు రమేష్ మెండిస్, దిల్షన్ మదుశంకా, పాతుమ్ నిస్సంకా మరియు అషేన్ బండారా చోటు దక్కించుకున్నారు. అత్యంత విజయవంతమైన శ్రీలంక పేస్ బౌలర్లలలో చమిందా వాస్‌ ఒకరు. తన బౌలింగ్‌తో మేటి బ్యాట్స్‌మన్‌కు సైతం అతడు చుక్కలు చూపించాడు. టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీశారు.

Story first published: Tuesday, February 23, 2021, 13:02 [IST]
Other articles published on Feb 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+