Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవ్వుల పాలయ్యాడు: క్రికెట్‌లో ఇలా కూడా ఔట్ అవుతారా? (వీడియో)

Chamara Silva's Attempt At Inventing New Shot Ends In Major Embarrassment

హైదరాబాద్: క్రికెట్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌, సె‍హ్వాగ్‌ అప్పర్‌ కట్‌, దిల్షాన్‌ దిల్‌స్కూప్‌, డివిలియర్స్‌ రివర్స్‌ స్వీప్‌ షాట్‌లు ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఫేమస్ షాట్ కోసం ప్రయత్నించిన శ్రీలంక బ్యాట్స్‌మన్‌ చమర సిల్వా నవ్వుల పాలయ్యాడు.

సాధారణంగా ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా.. వికెట్లు ముందే బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ చమర సిల్వా మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన పేరిట కూడా ఓ కొత్త షాట్ ఉండాలని అనుకున్నాడో ఏమో గానీ, లేదా త్వరగా ఔట్ కావలనుకున్నాడో ఏమో కానీ క్రీజులో వింతగా ప్రవర్తించాడు.

కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలో ఏమ్‌ఏఎస్‌ యునిచెల, తీజే లంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చమర సిల్వా ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో ఏకంగా వికెట్ల వెనుకకు పరుగెత్తి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త వికెట్లకు తగలడంతో నవ్వుల పాలయ్యాడు.


ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బంతి మాత్రం బ్యాట్‌కు తగిలితే చమర హీరో అయ్యేవాడని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించగా.. అతని భార్యతో బయటకు వెళ్లే పని ఉందో ఏమో అని మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో చమర సిల్వా జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. చమర ఇలా ఆడటం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఇలానే నిర్లక్ష్యంగా ఆడటంతో లంకబోర్డు రెండేళ్ల నిషేదం విధించింది. అయితే ఆ తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతించింది. శ్రీలంక తరుపున ఇప్పటివరకు చమర సిల్వా 11 టెస్టులు, 75 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 10:42 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+