
హైదరాబాద్: మొదటి రెండు టెస్టుల పరాజయం తర్వాత భారత్ కోలుకున్నట్లే అనిపిస్తుంది. ఈ రెండు టెస్టుల్లో స్థానం దక్కించుకోలేకపోయిన రహానె మూడో టెస్టుకు బ్యాట్ అందుకున్నాడు. భారీ అంచనాలతో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం 48 పరుగులను చేసి భారత్ పరువుతో పాటు అతనిపై పెట్టుకున్నఆశలను నిలబెట్టుకున్నాడు. భారత్ వైట్ వాష్ అయిపోతుందేమో అనుకున్న తరుణంలో కొద్దిపాటి ఆశలు చిగురించేలా చేశాడు.
'ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌కు ముందు బాగా ప్రేరణ పొందాను. ఇంతటి క్లిష్టమైన మైదానంలో ఆడినప్పుడు మనలోని ప్రేరణ స్థాయి ఇంకా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సంయమనం పాటించాలి. ఆవేశంతో పరుగులు చేయాలని ప్రయత్నిస్తే అవుట్ అయిపోతాం' అని వాండరర్స్ పిచ్ గురించి విశ్లేషించాడు రహానె.
'వంద పరుగులకు నాలుగు వికెట్లు పడ్డాయి. అప్పుడు నాకు అనిపించింది. భారత జట్టు ఇంకా 70 నుంచి 80 పరుగుల వరకు మాత్రమే చేయగలదేమో అని. కానీ, అనుకోని రీతిలో 240పరుగులు సాధించడమంటే నిజంగా మంచి పరిణామమే. నేను ఆడిన అన్ని పిచ్‌ల కంటే ఇక్కడ ఆడటం ఓ ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది.' అంటూ రహానె అభిప్రాయపడ్డాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ, మురళీ విజయ్‌లు ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి చాలానే ఇబ్బందిపడ్డారు. కానీ, వాళ్లు ఇబ్బందిపడిన స్థాయిని నేను భావించలేదు. వాళ్లలా క్రీజులో ఉండడమే ధ్యేయంగా ఆడలేదు. సాధ్యమైనంత వరకు ప్రతి బంతికి పరుగు తీయాలనే ధ్యాస లోనే ఉన్నాను. ఏ బాల్‌కి ఎలా స్పందించాలి. అనుకునే ఆడగలిగానంటూ' అజింకా రహానె వ్యాఖ్యానించాడు.
జనవరి 27, 28 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ వేలానికి రహానె పేరును కూడా బీసీసీఐ ఆమోదించింది. రహానెను రాజస్థాన్ రాయల్స్ రూ.4 కోట్లతో కొనుగోలు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.