Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్ 'గర్ల్‌ఫ్రెండ్' ఆర్జే మహవాష్‌తో ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

RJ Mahvash: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి ఆర్జే మహవాష్ మ్యాచ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే పుకార్లు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్జే మహవాష్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ జట్టు తరపున చీర్స్ చేస్తూ మైదానంలో కనిపించింది. మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చాహల్ తో దిగిన ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలను ఆర్జే మహవాష్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్ సమయంలో ఆర్జే మహవాష్ ఒక అమ్మాయితో కనిపించింది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది. ఇంతకు ఆ మిస్టరీ గర్ల్ ఎవరో అనేది తెలుసుకోండి.

ఆర్జే మహవాష్‌తో ఉన్న ఆ అప్సర ఎవరు?
నిజానికి ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ భార్య. ఆమె పేరు మోలీ సింధు. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల జరిగిన మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఆర్జే మహవాష్ మోలీ సింధును కలిసింది. మోలీ సింధు, హర్‌ప్రీత్ బ్రార్ 2025లోనే వివాహం చేసుకున్నారు. మోలీ సింధు ఇన్‌స్టా‌గ్రామ్‌ను అంతగా ఉపయోగించదు. ఆర్జే మహవాష్ ఇటీవల పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటాతో కూడా ఒక ఫోటోను కూడా పంచుకుంది.

Chahal s rumored girlfriend RJ Mahvash is spotted with a mysterious beauty Who is her

హర్‌ప్రీత్ బ్రార్ ఐపీఎల్ కెరీర్ ఇలా..
29 ఏళ్ల హర్‌ప్రీత్ బ్రార్ 2019లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి హర్‌ప్రీత్ బ్రార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 41 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ లో హర్‌ప్రీత్ బ్రార్ 7.90 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో హర్‌ప్రీత్ బ్రార్ పేరు మీద 233 పరుగులు కూడా ఉన్నాయి. హర్‌ప్రీత్ బ్రార్ దేశీయ క్రికెట్ కూడా ఆడుతాడు. హర్‌ప్రీత్ బ్రార్ 18 లిస్ట్-ఏ, 88 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 19, 77 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, April 12, 2025, 13:24 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+