For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ.. సో సారీ.. మీది చెత్త రికార్డు..!

Chahal takes five, South Africa spun out for lowest total at home

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత బౌలర్లు మొదటి వన్డే అనంతరం రెండో వన్డేలో సైతం అదే దూకుడు ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా జట్టు నిలబడలేకపోయింది. కేవలం 32ఓవర్లకే 118 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

దీంతో సొంతగడ్డపై జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకుంది. స్వదేశంలో తొలిసారి అత్యల్ప వన్డే స్కోరును నమోదు చేసిన సఫారీ జట్టు చెత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ ముప్పై పరుగులకు మించి చేయలేకపోవడంతో దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫలితంగా స్వదేశంలో అత్యల్ప వన్డే స్కోరును సఫారీలు నమోదు చేశారు.

గణాంకాల ప్రకారం చూస్తే.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఇది రెండో అత్యల్ప వన్డే స్కోరు. అంతకుముందు 1999లో నైరోబిలో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికాను 117 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ చేసింది. కాగా,దక్షిణాఫ్రికా అత్యల్ప వన్డే స్కోరు 69 1993లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు రెండంకెల స్కోరుకే చాపచుట్టేశారు.

తాజా మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ ఐదు వికెట్లు సాధించి సఫారీల పతనాన్ని శాసించాడు. ఇదే చాహల్‌కు అత్యుత్తమ వన్డే ప్రదర్శన. చాహల్‌ 8.2 ఓవర్లలో ఒక మేడిన్‌ సాయంతో 22 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. అతనికి జతగా కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీశాడు. ఆరు ఓవర్లలో కుల్దీప్‌ 20 పరుగులిచ్చి మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్‌కు నిర్దేశించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 4, 2018, 17:19 [IST]
Other articles published on Feb 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+