For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: కోహ్లీలో చాలా మార్పు వచ్చింది.. ఆ మాటల్లో అసలు నిజం లేదంటున్న చాహల్!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో మారిపోయాడని, మైదానంలో కూడా సరదాగా ఉంటున్నాడని కొందరు అంటున్నారు. అయితే ఈ వాదనతో స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విభేదించాడు. కోహ్లీలో ఎలాంటి మార్పు లేదని, అతను గతంలో ఉన్నట్లే పూర్తి ఎగ్రెసివ్‌గా ఉన్నాడని చాహల్ చెప్పాడు. మైదానం బయట కోహ్లీ ప్రశాంతంగా కనిపిస్తున్నాడు కదా అంటే.. కోహ్లీ ఎప్పుడూ అలాగే ఉండేవాడన్నాడు.

ఇటీవలి కాలంలో ఒక క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా కోహ్లీ మారాడని, అతనిలో ప్రశాంతత పెరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లీ విషయంలో అలాంటిది ఏం జరగలేదని, కోహ్లీ ఎప్పుడూ ఇలాగే ఉండేవాడని చాహల్ చెప్తున్నాడు. మైదానంలో పూర్తి ఎగ్రెసివ్‌గా కనిపించే కోహ్లీ.. మైదానం బయట ఎప్పుడూ చాలా ప్రశాంతంగానే ఉంటాడు అని చాహల్ వివరించాడు.

Chahal says Kohli did not change a single bit

'నన్నడిగితే కోహ్లీ ఏమాత్రం మారలేదు. మైదానంలో అతను ఎప్పట్లాగే దూకుడుగా ఉన్నాడు. ఇక మైదానం బయట కోహ్లీ చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడు. మైదానంలో ఈ దూకుడు మనకు చాలా యూజ్ అయంది అనుకంటే.. నేను కూడా అలాగే ఉంటా' అని చాహల్ వెల్లడించాడు. దీనికి ఉదాహరణగా రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ అని గుర్తుచేశాడు.

'పాంటింగ్ నేతృత్వంలోని టీం ప్రత్యర్థులను డామినేట్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీమిండియాను స్లెడ్జ్ చేస్తే ఏం జరుగుతుందో వాళ్లకు తెలిసొచ్చింది' అని చాహల్ చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆసీస్ వెళ్లిన జట్టు అక్కడ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమను ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జ్ చేస్తే.. భారత ఆటగాళ్లు ఊరుకునే రోజులు అప్పటితో పోయాయి.

అలాగే తన కెరీర్ మెరుగవడానికి కూడా కోహ్లీ చాలా సహకారం అందించాడని కూడా చాహల్ గుర్తుచేసుకున్నాడు. ఆర్సీబీ తరఫున చాహల్ అరంగేట్రం చేసింది కోహ్లీ కెప్టెన్సీలోనే కావడం గమనార్హం.

Story first published: Sunday, July 16, 2023, 19:12 [IST]
Other articles published on Jul 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+