Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్ 6 వికెట్లు, ధోని తొలి అర్ధసెంచరీ: స్టాటస్టికల్ హైలెట్స్ ఇవే

హైదరాబాద్: సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20లో భారత లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లాండ్‌ను తిప్పేశాడు. అనూహ్యరీతిలో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై టీమిండియాకిది హ్యాట్రిక్‌ సిరీస్‌ విజయం కావడం విశేషం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్‌ రైనా 45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 63 పరుగులతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. ధోని కూడా రైనాకు సహకరిస్తూ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 56 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ తొలి టీ20లో ధోని తొలిసారి అర్ధసెంచరీని నమోదు చేశాడు.

ఇక యువరాజ్ సింగ్ 27, కేఎల్ రాహుల్ 22, హార్ధిక్ పాండ్యా 11 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ 13వ ఓవర్‌ వరకు లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించింది.

13వ ఓవర్‌లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లను వెంటవెంటనే కోల్పోవడం గమనార్హం. 12 బంతుల తేడాలో ఐదు వికెట్లు తీశాడు. రెండో ఎండ్‌లో బుమ్రా (3/14).. 9 బంతుల తేడాలో మూడు వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చాహల్ ఆరు వికెట్లు తీసుకోగా, బుమ్రా మూడు, అమిత్ మిశ్రా ఒక వికెట్ తీసుకున్నారు.

మూడో వన్డేలో నమోదైన స్టాటస్టికల్ హైలెట్స్:

తన కెరీర్‌లోనే తొలిసారి చాహల్ అత్యుత్తమ గణాంకాలు

తన కెరీర్‌లోనే తొలిసారి చాహల్ అత్యుత్తమ గణాంకాలు

మూడో టీ20లో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన యజువేంద్ర చాహల్ 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్‌ భారత్‌ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన అజంతా మెండిస్‌ (6/8; 6/15) చాహల్‌ కంటే ముందున్నాడు.

ఇంగ్లాండ్‌పై టీమిండియా అరుదైన రికార్డు

ఇంగ్లాండ్‌పై టీమిండియా అరుదైన రికార్డు

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగిన ఓపెనింగ్ గేమ్‌లో ఓటమి పాలై ఆ తర్వాత టీమిండియా సిరిస్‌ని సొంతం చేసుకోవడం ఇది మూడోసారి. ఈ విధంగా ఆస్ట్రేలియా గతంలో రెండుసార్లు చేసింది.

అంతర్జాతీయ టీ20లో తొలి అర్ధసెంచరీ సాధించిన ధోని

అంతర్జాతీయ టీ20లో తొలి అర్ధసెంచరీ సాధించిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టీ20లో తొలి అర్ధసెంచరీని నమోదు చేశాడు. ఇప్పటివరకు టీ 20ల్లో 66 ఇన్నింగ్స్ ఆడిన ధోనీ ఇంగ్లండ్‌పై ఆ మైలురాయి దాటాడు. కేవలం 32 బంతుల్లోనే 4 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 48 నాటౌట్ ధోనీ అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో ధోని వీర విహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోని టీ20ల్లో 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు. టీ20ల్లో అర్ధసెంచరీ సాధించేందుకు ధోనికి 76 ఇన్నింగ్స్‌లు పట్టింది.

బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ చెత్త రికార్డు

బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ చెత్త రికార్డు

బెంగుళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ చెత్త రికార్డుని సొంతం చేసుకుంది. 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. 1946లో ఆస్ర్టేలియాతో టెస్టులో న్యూజిలాండ్‌ 5 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ పరుగులకే ఇన్ని వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.

7 ఏళ్ల తర్వాత సురేశ్ రైనా అర్ధసెంచరీ

7 ఏళ్ల తర్వాత సురేశ్ రైనా అర్ధసెంచరీ

బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వెటరన్ క్రికెటర్ 7 ఏళ్ల తర్వాత అర్ధసెంచరీని నమోదు చేశాడు. చివరిసారిగా 2010లో టీ20 అర్ధసెంచరీ సాధించిన రైనా 38 ఇన్నింగ్స్‌ల తర్వాత మళ్లీ అర్ధ సెంచరీ మార్కును అధిగమించాడు.

యువీ సిక్సర్ల హోరు

యువీ సిక్సర్ల హోరు

మూడో టీ20లో సురేశ్ రైనా తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌సింగ్‌ 10 బంతుల్లో ఒక ఫోరు, 3 సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6,6,4,6,1 పరుగులు రాబట్టాడు. యువీ సిక్సర్ల హోరు చూసి జోర్డాన్‌ తలపట్టుకొన్నాడు. ఐతే ఆ తర్వాత ఓవర్‌లో తైమల్‌ మిల్స్‌ వేసిన తొలి బంతిని అంచనా వేయలేకపోయిన యువీ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

టీ20ల్లో పవర్ ప్లేలో మూడు సిక్సర్లు

టీ20ల్లో పవర్ ప్లేలో మూడు సిక్సర్లు

టీ20ల్లో పవర్ ప్లేలో మూడు సిక్సర్లు కొట్టిన సురేశ్ రైనా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మతో కలసి రెండో స్థానంలో నిలిచాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్ పై పవర్ ప్లేలో 4 సిక్సర్లు సాధించాడు. 2016లో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొట్టాడు. బెంగుళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో సురేశ్ రైనా ఈ అరుదైన ఘనతను నెలకొల్పాడు.

రిషబ్ పంత్

రిషబ్ పంత్

టీమిండియా తరుపున అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడిగా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసే నాటికి రిషబ్ పంత్ వయసు 19 ఏళ్ల 120 రోజులు. అంతక ముందు 19 ఏళ్ల 152 రోజులతో ఇషాంత్ శర్మ ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+