మీమర్స్ మీకోసమే.. పండగ చేసుకోండి, నెట్టింట వైరలవుతున్న చాహల్ పోజు

ఐపీఎల్ 2022లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన క్రికెటర్‌గా యజ్వేంద్ర చాహల్ నిలిచిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ తీసిన అనంతరం యజ్వేంద్ర చాహల్ గ్రౌండ్లో పరిగెత్తుతూ, గెంతుతూ ఒక్కసారిగా కింద ఓ పోజులో కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని సేదతీరుతున్నట్లు కులాసాగా కూర్చున్న ఈ పోజు నెట్టింట వైరల్ అవుతోంది. బౌలర్లు వికెట్లు తీసినప్పుడు తమ మార్క్ సంబరాలు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.
ముఖ్యంగా వెస్టిండీస్ ప్లేయర్లైన బ్రావో డ్యాన్స్ చేయడం, కాట్రెల్ సెల్యూట్ చేయడం చూసే ఉంటాము. వాళ్లకంటూ ఓ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌లా మారిపోయింది. అలాగే ఇప్పుడు చాహల్‌కు కూడా కులాసాగా కూర్చోవడం ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్‌గా మారిపోయింది. దీని వెనక కూడా ఓ కథ ఉంది.
2019 వరల్డ్ కప్ నాటి సంగతి..
2019లో వన్డే వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య గ్రూప్ మ్యాచ్ జరుగుతుండగా.. బౌండరీ అవతల చాహల్ కాలు మీద కాలు వేసుకుని నేలపై కులాసాగా ఒరిగి కూచున్నాడు. అలాగే పక్కన ఓ ట్రే నిండా కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్‌ను వీక్షించాడు.
ఆ పోజు అప్పట్లో ట్రెండింగ్ పిక్ అయింది. ఈ పిక్ మీద ఎన్నో మీమ్స్ వచ్చాయి. తదనంతరం.. ఈ పిక్ ఉపయోగించే సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా ట్రోలర్స్ చేశారు. క్రికెటర్‌గానే కాకుండా మీమ్ స్టార్‌గా చాహల్ ఫేమస్ అయిపోయాడు.
ట్రిక్కులమారి చాహల్.. హ్యాట్రిక్ సాధించాడిలా..
ఐపీఎల్ 2022లో సోమవారం నాటి రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 218పరుగుల లక్ష్యం దిశగా సాగుతుండగా..17ఓవర్లో చాహర్ బంతిని అందుకున్నాడు. 17వ ఓవర్ తొలి బంతికే వెంకటేష్ అయ్యర్‌ను ఔట్ చేసి కోల్‌కతాకు షాకిచ్చాడు. ఆ తర్వాత నాలుగో బంతికి శ్రేయాస్ అయ్యర్ (85)ను ఎల్బీడబ్ల్యూగా బుట్టలో వేశాడు.
ఆ తర్వాత శివమ్ మావి(0)ని ఊరించే బంతితో హిట్ చేసేలా ప్రేరెపించి క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత విధ్వంసకర ఆల్‌రౌండర్ కమ్మిన్స్‌ను తన లెగ్ స్పిన్ మాయాజాలంతో బురిడి కొట్టించగా.. బంతి కమ్మిన్స్ బ్యాట్ అంచుని తాకి నేరుగా కీపర్ శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. అంతే హ్యాట్రిక్ వికెట్లు వచ్చాయి.
మీమర్స్‌కు చాహల్ ఆఫర్
కమ్మిన్స్ ఔట్ అవగానే హ్యాట్రిక్ వికెట్లొచ్చిన ఆనందంతో చాహల్ కవర్ దిశగా ఒకటే పరుగు తీశాడు. జట్టు ప్లేయర్లు కూడా అతని వెంట పరిగెత్తారు. పరిగెత్తి ఒక చోట ఆగి తన కులాసా పోజులో కింద కూర్చుని స్టాండ్స్ వైపు చూశాడు. మీమర్స్ మీకోసమే ఈ పోజు పండగ చేసుకోండంటూ హింట్ ఇచ్చాడు. గతంలో వరల్డ్ కప్ టైంలో తన పోజును మీమర్స్ వాడుకున్న విషయాన్ని గుర్తుచేసేలా చాహల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ పోజు ఇప్పుడు నెట్టింటా వైరలవుతుంది. ఈ పోజు చాహల్ ఐకానిక్ పోజుగా మారిపోయింది. మీమర్స్ ఈ పోజుపై మరోసారి తమ క్రియేటివిటిని చూపించేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications