
హైదరాబాద్: భారత్ -శ్రీలంకకు మధ్య మ్యాచ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఫార్మాట్‌లు అయితే మారుతున్నాయి. కానీ, ఫైటింగ్ స్పీడ్ మారటం లేదు. భారత్ అదే దూకుడుతో దూసుకుపోతోంది. బుధవారం కటక్‌లోని బారాబతి వేదికగా జరిగిన టీ20ఫార్మాట్‌లో మళ్లి ఇంకోసారి చెలరేగిపోయింది. పాపం .. శ్రీలంక తొలి మ్యాచ్‌లోనే చతికిలబడింది.
ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా విజృంభించారు. ధోనీ ధనాధన్ తన బ్యాటింగ్ ప్రతిభను మళ్లీ ఇంకోసారి గుర్తు చేశాడు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సైతం ఇరగదీశాడు.
చాహల్ స్పిన్నర్లు :
భారత్ ఫీల్డింగ్ కట్టుదిట్టం ఒక ఎత్తయితే స్పిన్నర్ల మాయాజాలం ఒక ఎత్తు. ఈ మ్యాచ్‌లో చాహల్, కుల్‌దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా వేసిన బంతులను ఎదుర్కోవడం శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌కు అసాధ్యమైంది. యజువేంద్రచాహల్, కుల్‌దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా వరుసగా నాలుగు ఓవర్లు వేసి ప్రత్యర్థి జట్టుకు 23, 18, 29 పరుగులను ఇచ్చారు. చాహల్ నాలుగు వికెట్లను తీశాడు. కుల్‌దీప్ యాదవ్, హార్థిక్ పాండ్యా, 2, 3 వికెట్లను తీశారు.
శ్రీలంక వికెట్ల పతనం:
హార్దిక్ పాండ్య 4-0-29-3; ఉనద్కత్ 2-0-7-1; చాహల్ 4-0-23-4; బుమ్రా 2-0-10-0; కుల్‌దీప్ యాదవ్ 4-0-18-2
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.