Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలిపించని సెంచరీ ఏం లాభం: రోహిత్ శర్మ అసంతృప్తి

పెర్త్: రోహిత్ శర్మకు చేదు! భారత జట్టు తరఫున అతను తాజాగా చేసిన మూడు సెంచరీలు వృథా అయ్యాయి! మూడు సెంచరీలు కొడితే.. మూడింటిలోని భారత్ ఓడిపోయింది. తాజాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 171 పరుగులు చేశాడు. కానీ ఈ వన్డేలో ఆసిస్ గెలిచింది.

దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. సెంచరీ చేసినా భారత్ గెలువకపోవడంతో రోహిత్ శర్మ అసంతృప్తితోనే ఉన్నాడు. రోహిత్ మాట్లాడుతూ... తాను మంచి ఇన్నింగ్స్ ఆడానని, అయితే లాభం లేకుండా పోయిందని, జట్టు గెలవని మ్యాచ్‌లో సెంచరీ చేసినా ఆనందం నిలవదని చెప్పాడు.

ఆ ఇన్నింగ్స్‌కు ప్రాధాన్యం కూడా ఉండదన్నాడు. 'గొప్ప ఇన్నింగ్సే ఆడాను. సిరీస్‌ను సానుకూల దృక్పథంతో ఆరంభించడం కీలకం. కానీ చివరి మేం మ్యాచ్‌ గెలవకపోవడం నిరాశ కలిగించింది. జట్టు గెలవకుంటే మనం ఎంత స్కోరు చేసినా దానికి విలువ ఉండద'ని రోహిత్ శర్మ చెప్పాడు.

Century is immaterial if team does not win: Rohit Sharma

సెంచరీ ఓ మైలురాయి మాత్రమేనని, ఆ తర్వాత జట్టు కోణంలో ఆలోచించాలని, మరింత భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని, ఈ లక్ష్యంతోనే చివరి దాకా క్రీజులో నిలిచి భారీ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తున్నానని, ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడేటపుడు షాట్ల ఎంపిక కీలకమని, ఈ విషయంలో నాకంటూ ఓ ప్రణాళిక ఉందని చెప్పాడు.

2008 అండర్ - 19 వన్డే ప్రపంచకప్‌ తన కెరీర్లో పెద్ద మలుపు అని భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌లో అండర్ - 19 ప్రపంచకప్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో ఈ టోర్నీ కుర్రాళ్లకు ఎంత ముఖ్యమో చెబుతూ.. 2008లో తన సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+