Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఇకపై ఐపీఎల్‌లో అవి కనపించకూడదు - కేంద్రం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై ఐపీఎల్ లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదేశిస్తూ.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కాగా, ప్రతి ఏడాది భారత్‌లో సంభవిస్తోన్న 70 శాతం మరణాలకు క్యాన్సర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులే కారణం. పొగాకు సంబంధిత మరణాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.

Central Government Health Ministry Ban tobacco alcohol advertisement in IPL 2025

"ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్.. భారత్ లో అత్యధికంగా వీక్షించే స్పోర్ట్. కాబట్టి స్పోర్ట్స్ కు సంబంధించి ఏ ఆటలోనైనా పొగాకు, మద్యానికి సంబంధించిన ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ప్రమోషన్ చేయకూడదు. ఐపీఎల్ గేమ్స్ లేదా ఇతర ఈవెంట్లు జరిగే స్టేడియం ప్రాంగణాలు లేదా జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వకూడదు. వాటి అమ్మకాలపై కూడా నిషేధం ఉంది. ఆటగాళ్లు కూడా వాటిని ప్రమోట్ చేయకూడదు. ఈ నిబంధనలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలి. అమలు చేయాలి. యువతకు క్రికెటర్స్ రోల్ మోడల్స్. హెల్తీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ విషయంలో వారే యూత్ కు ఆదర్శ వంతులు. ప్రజలకు ఆరోగ్యం పట్ల, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఐపీఎల్ కు సామాజిక, నైతిక బాధ్యత ఉంది." అని కేంద్రం లేఖలో పేర్కొంది.

మార్చి 22 నుంచి లీగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మధ్య జరగనుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా రెండో మ్యాచ్ సైన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్‌ జట్ల మధ్య ఉండనుంది.

Story first published: Monday, March 10, 2025, 14:32 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+