For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటకి కొద్దిగా విరామం: ఇట్స్ వెడ్డింగ్ టైమ్ (2017)

హైదరాబాద్: 2017 సంవత్సరం క్రీడాకారులందరికీ బాగా కలిసి శ్రీమతిని తెచ్చి పెట్టింది. వరుసపెట్టి పెళ్లిల్లు చేసుకున్నారు. ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అయితే సంతానంతో కలిసి పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. మూడు పదుల వయస్సును దాటనివ్వకూడదనేమో కొందరైతే మతాంతర వివాహాలు చేసుకున్నారు. జరిగిన పెళ్లిళ్లపై లుక్కేయాలంటే ఓ సారి వెనక్కి వెళ్లాల్సిందే.

విరాట్ శర్మ-అనుష్కల పెళ్లి

అనుష్క శర్మ ప్రతినిధి ఏమీ లేదు అంతా ఒట్టిదే అని కొట్టి పడేశాడు. కానీ, ఒకటి కాదు రెండు కాదు వరుసగా వస్తున్న రూమర్లు నిజమేనన్నట్లుగా అనిపించాయి. చివరికి అవే నిజమైయ్యాయి. ఇటలీకి వెళ్లిన ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన అత్యంత కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరిగింది.

అనుష్క సిగ్గుల మొగ్గ

అనుష్క సిగ్గుల మొగ్గ

మిలాన్ (ఇటలీ)లోని టుస్కానీలో ఓ ఖరీదైన రిసార్టులో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పూర్తిగా పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ డిజైన్ చేసిన పింక్ లెహంగాలో అనుష్క సిగ్గుల మొగ్గ అయిపోగా.. సంప్రదాయ షేర్వాణిలో విరాట్ మెరిసిపోయాడు. పెండ్లి తంతు ముగిసిన తర్వాత విరుష్క జంట.. తమ ప్రేమ బంధానికి అక్షర రూపమిచ్చింది. వారి ప్రేమ అలానే జీవితాంతం కొనసాగాలని పరస్పరం వాగ్దానం చేసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే నిజమైన అశీర్వాదమంటూ మురిసిపోయారు.

భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ప్రేమ వివాహం

సుదూర కాల ప్రేమాయాణం తర్వాత ఇండియన్ పుట్‌‌బాల్ టీం కెప్టెన్ సునీల్ చెత్రీ ఒకింటివాడయ్యాడు. నవంబర్ 20న వీరి నిశ్చితార్థం గుర్గావ్‌లో జరిగగా డిసెంబర్ 4న వివాహం జరిగింది.

మోహన్ బగాన్ దిగ్గజ పుట్‌‌బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనమ్ తో ప్రేమలో ఉన్న సునీల్ చెత్రి కోల్ కత్తాలో డిసెంబర్4న అతిరథ మహారథుల సమక్షంలో ప్రియురాలినే వివాహమాడాడు. గుర్రపు బగ్గీలో ఊరేగింపు జరిపి పెళ్లి సంబరాన్ని నేపాలీ, బెంగాలీ సంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

జహీర్‌ఖాన్ సాగరికల మతాంతర వివాహం

టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేల వివాహం నవంబర్ 23 (గురువారం) ముంబైలోని రిజస్టర్ ఆఫీసులో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. ఈ పెళ్లి అనంతరం వీరిద్దరూ బంధువులకు, స్నేహితులకు ప్రత్యేక విందు కార్యక్రమాలను ఇచ్చారు.

లియోనల్ మెస్సీ లవ్ మ్యారేజ్ విత్ హిస్ సన్

బార్సిలోనా లెజెండ్ లియోనల్ మెస్సీ తన చిన్ననాటి ప్రేయసి, స్వీట్‌హార్ట్ అయిన ఆంటోనెల్లానే వివాహమాడాడు. పేరుకే పెళ్లి తంతుకానీ, పెళ్లితో భార్యాభర్తలు కావాల్సిన వాళ్లు ఇప్పటికే అమ్మానాన్న అయ్యారు. 30 జూన్ 2017న వీరి వివాహం జరిగింది.

సెరెనా విలియమ్స్ వేరొకరికి సెట్ అయిపోయింది

ఆహా అనుకునే ఆట టెన్నిస్. ఈ ఆటపై అభిమానమో క్రీడాకారిణిపై అభిమానమో కానీ, కొంతమంది ఆడుతుంటూ కన్నుతిప్పుకోలేం. అలాంటి క్రీడాకారిణే సెరెనా విలియమ్స్. నవంబరు 16వ తేదీ రెడ్డిట్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడింది.

అశ్విని పొన్నప్ప వెడ్స్ కరణ్ మెడప్పా

ఇది మాత్రం అరేంజ్‌డ్ మ్యారేజ్ ఎందుకవుతుంది ఇదీ అదే. 28ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ అశ్విన్ పొన్నప్ప ఈ ఏడాదితో బ్రహ్మచర్యానికి గుడ్ బై చెప్పి భార్యతో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యాడు. వ్యాపారవేత్త కమ్ మోడల్ అయినటువంటి కరణ్ మెడప్పాతో కర్ణాటకలోని కొడవ అనే గ్రామంలో సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుని దంపతులయ్యారు.

భువీ పెళ్లై పోయింది

భువీ పెళ్లై పోయింది

భారత క్రికెటర్‌ భువనేశ్వర్‌ కుమార్ రిసెప్ష‌న్ వేడుక ఘనంగా జ‌రిగింది. త‌న ప్రియురాలు నూపూర్ న‌గ‌ర్‌ను న‌వంబ‌రు 23న పెళ్లాడాడు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్‌కు క్రికెట్ ప్ర‌ముఖులు విచ్చేయ‌డంతో వేదిక‌కు మరింత క‌ళ వ‌చ్చిప‌డింది.

వివాహ వేడుక‌కు విరాట్ కోహ్లీ త‌న ప్రియురాలు అనుష్కతో పాటు హాజ‌రవ్వ‌గా ఈ సారి ఒంట‌రిగా వ‌చ్చాడు. ధావన్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, సురేశ్‌ రైనా తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. ధోనీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌, టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్‌ సభ్యులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

టెన్నిస్ స్టార్ ఇజ్నర్ మ్యారేజ్ ఓవర్

అమెరిక‌న్ టెన్నిస్ స్టార్ ఇజ్న‌ర్ త‌న ప్రియురాలు మాడిస‌న్ మెక్ కిన్లేను వివాహ‌మాడి త‌న ప్రేమ బండిని ప‌ట్టాలెక్కించాడు. జ్యూయెల‌ర్ డిజైన‌ర్ మాడిస‌న్‌తో ఆర్నెళ్ల క్రితం నిశ్చితార్థంతో సగం పెళ్లి తంతు జ‌రిగింది డిసెంబ‌ర్ 4న సౌత్ కెరోలినాలో వీరి వివాహోత్స‌వం జ‌రిగింది.

చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రూ ఒక‌ట‌వుతుండ‌టంతో ప్ర‌ముఖులు, ఫుట్‌బాల్ క్రీడాకారులు సామ్ క్వార్రీ, జేమ్స్ బ్లేక్‌, స్టీవ్ జాన్స‌న్‌, అలెక్స్ కుజ్నోత్స‌వ్‌ల‌తో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు, బంధుమిత్రులు పెళ్లి వేడుక‌కు హాజ‌రై త‌మ శుభాకాంక‌లు అంద‌జేశారు.

పాండ్యా పెళ్లి పండగ డిసెంబరు 27

పాండ్యా పెళ్లి పండగ డిసెంబరు 27

2017 ఏడాదిలో జరిగిన క్రీడాకారుల వరుస పెళ్లిళ్లకు కృనాల్ పాండ్య పెళ్లి ముగింపు పలికింది. పాండ్య జంట డిసెంబరు 26న ముంబైలో మెహందీ కార్యక్రమాన్ని ముగించుకుంది. ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకలో తన ప్రేయసి ఫంకురి శర్మని పెళ్లాడి డిసెంబరు 27న ఒకింటి వాడయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 11:58 [IST]
Other articles published on Dec 29, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+