హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ పైనల్లో సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆసీస్‌పై ఆమె చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్‌ను 1983 వరల్డ్ కప్‌లో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌తో పోలుస్తున్నారు.
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి... కపిల్ దేవ్, హర్మన్ ప్రీత్ కౌర్‌ల ఇద్దరి ఫొటోలు పెట్టి అప్పటి ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చిందంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇలా పోల్చడంపై తాజాగా కపిల్ దేవ్ స్పందించారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా పోల్చకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
'హర్మన్ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించలేదు. కానీ, తొందర్లోనే రికార్డు వెర్షన్ చూస్తా. ఆమె నుంచి ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ రావడం దేశానికి గర్వకారణం. హర్మన్ ఇన్నింగ్స్ ప్రత్యేకమైంది. మహిళల క్రికెట్‌కు ఆశించిన ప్రోత్సాహం లేకున్నా ఇలాంటి ఇన్నింగ్స్‌లు బయటకు రావడం గొప్ప విషయం. ఇది భారత క్రికెట్‌కు ఓ ప్రత్యేకమైన రోజు' అని కపిల్ తెలిపారు.
ఆసీస్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిందని కపిల్ కొనియాడారు. 'ఇప్పటికే భారత్ వరల్డ్ కప్ గెలిచిన భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇంగ్లండ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందుకే ఫైనల్‌లో వారికి శుభాభినందనలు తెలుపుతున్నా' అని కపిల్ మీడియాతో అన్నారు.
1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్ 17/5తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు సాధించారు. మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేశాడు.