CEAT Cricket Awards 2024: రోహిత్ టూ జైషా..అవార్డుల పూర్తి జాబితా ఇదే!
ముంబై వేదికగా సియెట్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఏడాదిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు, క్రీడా నాయకులకు 26వ ఎడిషన్ సియెట్ అవార్డులు దక్కాయి. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలు భారత స్టార్ క్రికెటర్లు అవార్డులు అందుకున్నారు.
బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ క్రీడా పరిపాలకుడిగా ఎంపికయ్యారు. విదేశీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, టిమ్ సౌథికి కూడా పురస్కారాలు లభించాయి. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ సాల్ట్, న్యూజిలాండ్ ప్రధాన బౌలర్ సౌథికి అవార్డులు దక్కాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు అత్యుత్తమ కెప్టెన్‌గా అవార్డు దక్కింది. కాగా, సియెట్ క్రికెట్ అవార్డులు-2024 పూర్తి జాబితా..

జీవితకాల సాఫల్య పురస్కారం: రాహుల్ ద్రవిడ్
అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ
వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్: విరాట్ కోహ్లీ
వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్: మహ్మద్ షమీ
టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: యశస్వీ జైస్వాల్
టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: ఫిల్ సాల్ట్
T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్: టిమ్ సౌథీ
దేశీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సాయి కిషోర్
ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్: శ్రేయస్ అయ్యర్
ఉత్తమ క్రీడాపరిపాలకుడు: జై షా
మహిళల విభాగంలో..
భారత బ్యాటర్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన
భారత బౌలర్ ఆఫ్ ది ఇయర్: దీప్తి శర్మ
మహిళల T20I చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మెమెంటో
మహిళల టెస్టులో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన షెఫాలీ వర్మకు మెమెంటో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications