Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026.. తెలుగు వారియర్స్ షెడ్యూల్ ఇదే!

CCL 2026: సినిమా గ్లామర్, క్రికెట్ మజా కలగలిసిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2026 సందడి మొదలైంది. వెండితెరపై అభిమానులను అలరించే తారలు ఇప్పుడు మైదానంలో పరుగుల వేట సాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న తెలుగు వారియర్స్ షెడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ సినీ పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన హీరోలు, టెక్నీషియన్లు క్రికెట్ బ్యాట్ పట్టి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2011లో ప్రారంభమైన ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్, అప్రతిహతంగా 12వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. బిజీ లైఫ్ నుంచి ఉపశమనం పొందేందుకు మన స్టార్స్ ఆడే ఈ ఆట, ఇప్పుడు అభిమానులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

CCL 2026 Telugu Warriors Full Schedule Squad and Match Details

తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
ఈ సీజన్‌లో తెలుగు వారియర్స్ మూడు కీలక లీగ్ మ్యాచ్‌ల్లో తలపడనుంది. అఖిల్ నేతృత్వంలోని మన జట్టు తన తొలి పోరును జనవరి 16న విశాఖపట్నం వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌తో ప్రారంభించనుంది. అనంతరం జనవరి 17న అదే వేదికపై పంజాబ్ దే షేర్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక మూడో మ్యాచ్ జనవరి 23న మధురై వేదికగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరగనుంది.

వేదికలు, కీలక తేదీలు
సీసీఎల్ 2026కు విశాఖపట్నం, మధురై, హైదరాబాద్ నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. జనవరి 16 నుంచి 25 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఉత్కంఠభరితమైన సెమీఫైనల్స్ జనవరి 31న నిర్వహించనున్నారు. ఇక టోర్నీ విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 1న భాగ్యనగరం (హైదరాబాద్) వేదికగా జరగనుంది. సొంత గడ్డపై ఫైనల్ జరుగుతుండటంతో తెలుగు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రికార్డుల రారాజు.. తెలుగు వారియర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా తెలుగు వారియర్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు తెలుగు వారియర్స్ జట్టు ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీని గెలుచుకుంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఎలాగైనా కప్ కొట్టి పూర్వ వైభవాన్ని చాటుకోవాలని పట్టుదలతో ఉంది. అఖిల్ అక్కినేని ఈసారి పక్కా వ్యూహంతో జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

తెలుగు వారియర్స్ ఫుల్ స్క్వాడ్
ఈసారి జట్టులో స్టార్ పవర్ పుష్కలంగా ఉంది. అఖిల్ అక్కినేని (కెప్టెన్), ఆది సాయికుమార్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నిఖిల్ సిద్ధార్థ్, ప్రిన్స్, రోషన్ మేకా, సచిన్ జోషి, సుధీర్ బాబు, థమన్, సుశాంత్, ఖయ్యుమ్, నంద కిశోర్, రఘు, సామ్రాట్ రెడ్డి, హరీష్, సాంబా ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న మన జట్టు ఐదో టైటిల్‌ను ముద్దాడటం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ ఏడాది మ్యాచ్‌ల టికెట్లను ప్రత్యేకంగా ఆన్‌లైన్ ద్వారానే విక్రయిస్తున్నారు. మీరు ticketgenie.in వెబ్‌సైట్ లేదా Ticketgenie యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. సామాన్య అభిమానులకు అందుబాటులో ఉండేలా టిక్కెట్ ధర కేవలం రూ.100 నుంచి ప్రారంభమవుతుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్‌కు M-Ticket (డిజిటల్ టికెట్) వస్తుంది. స్టేడియం గేట్ల వద్ద దీనిని చూపిస్తే సరిపోతుంది, ఫిజికల్ కాపీ అవసరం లేదు.

సీసీఎల్ 2026 జట్లు:
*తెలుగు వారియర్స్ (టాలీవుడ్)

*ముంబై హీరోస్ (బాలీవుడ్)

*కర్ణాటక బుల్డోజర్స్ (శాండల్‌వుడ్)

*చెన్నై కింగ్స్ (కోలీవుడ్)

*కేరళ స్ట్రైకర్స్ (మాలీవుడ్)

*బెంగాల్ టైగర్స్

*భోజ్‌పురి దబాంగ్స్

*పంజాబ్ దే షేర్

Story first published: Thursday, January 15, 2026, 14:33 [IST]
Other articles published on Jan 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+