Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CCL 2026: మొదలైన సీసీఎల్ సమరం .. తొలి మ్యాచ్‌లోనే హై-వోల్టేజ్ డ్రామా!

CCL 2026: వెండితెర తారలు మైదానంలోకి దిగి బ్యాట్లు, బాల్స్‌తో సందడి చేసే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 12వ సీజన్ నేటి నుంచే (జనవరి 16) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు సాగే ఈ టోర్నీలో భారతీయ సినిమా పరిశ్రమలోని వివిధ భాషల నటులు తలపడనున్నారు. జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా మొదలైన ఈ టోర్నీలో, తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్ దే షేర్ , కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి.

దక్ష్ సింగ్ హ్యాట్రిక్.. కష్టాల్లో కర్ణాటక
టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ హర్దీ సందూ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకకు పంజాబ్ బౌలర్ దక్ష్ సింగ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిలకడగా ఆడుతున్న డార్లింగ్ కృష్ణ (14)ను ఔట్ చేసిన దక్ష్, ఆ వెంటనే వచ్చిన రాజీవ్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి కర్ణాటక కెప్టెన్ సుదీప్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా సీసీఎల్ 2026లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో కర్ణాటక కేవలం 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

CCL 2026 Begins with High-Voltage Drama Hat-trick Fireworks in Opening Match

కరణ్ ఆర్యన్ వీరవిహారం
వికెట్లు పడుతున్నా ఒకవైపు కరణ్ ఆర్యన్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరణ్ ఆర్యన్ చేసిన 83 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే కర్ణాటక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరలో రనౌట్ల రూపంలో వికెట్లు కోల్పోవడంతో కర్ణాటక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బౌలర్లలో దక్ష్ సింగ్ మొత్తం 5 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్ హీరోగా నిలిచాడు.

పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు నింజా, ప్రదీప్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. గత సీజన్ విజేతగా ఉన్న పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుంది? 12 ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూస్తున్న కర్ణాటక ఈ మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంటుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

సీసీఎల్ 2026 జట్లు ఇవే..
ఈ ఏడాది మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. కేరళ స్ట్రైకర్స్ తిరిగి రావడంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది.
*తెలుగు వారియర్స్ (Tollywood)
*ముంబై హీరోస్ (Bollywood)
*చెన్నై కింగ్స్ (Kollywood)
*కర్ణాటక బుల్ డోజర్స్ (Sandalwood):
*కేరళ స్ట్రైకర్స్ (Mollywood):
*భోజ్‌పురి దబాంగ్స్
*బెంగాల్ టైగర్స్
*పంజాబ్ దే షేర్

వేదికలు:
ఈ మ్యాచ్‌లు ప్రధానంగా మూడు నగరాల్లో జరగనున్నాయి:

*విశాఖపట్నం (ACA-VDCA స్టేడియం)

*హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం)

*కోయంబత్తూరు (SNR కాలేజ్ క్రికెట్ గ్రౌండ్)

ప్రత్యక్ష ప్రసార వివరాలు
ప్రేక్షకులు తమ అభిమాన హీరోల ఆటను టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించవచ్చు. ప్రాంతీయ భాషల వారీగా ఛానెల్‌ల వివరాలు ఇలా ఉన్నాయి

తెలుగు- మా మూవీస్ ఛానెల్
తమిళం- Star Vijay Super (స్టార్ విజయ్ సూపర్)
మలయాళం- Asianet Movies (ఏషియానెట్ మూవీస్)
కన్నడ- Suvarna Plus (సువర్ణ ప్లస్)
హిందీ -Door Darshan (మొదటి 11 మ్యాచ్‌లు), DD Sports (చివరి 9 మ్యాచ్‌లు)
పంజాబీ- PTC Punjabi

Story first published: Friday, January 16, 2026, 16:46 [IST]
Other articles published on Jan 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+