For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది?: రిటైర్మెంట్ వార్తలపై సచిన్

'It's His Personal Decision'' Sachin Tendulkar On Dhoni Retirement || Oneindia Telugu
CC World Cup 2019: It’s His Personal Decision – Sachin Tendulkar On MS Dhoni’s Retirement

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీపైనల్ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకే కుప్పకూలింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా ఓటమితో మళ్లీ తెరపైకి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ వార్తలు ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది.

మరోసారి తెరపైకి ధోని రిటైర్మెంట్ వార్తలు

మరోసారి తెరపైకి ధోని రిటైర్మెంట్ వార్తలు

ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ధోని రిటైర్మంట్ వార్తలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించాడు. సచిన్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. రిటైర్మెంట్‌పై రూమర్లు వ్యాప్తి చేయకుండా టీమిండియాకు అతడు చేసిన సేవలను గౌరవించాలి. భారత క్రికెట్ అతడు ఎంతో చేశాడు. రిటైర్మెంట్‌పై నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అతడికే వదిలేయండి" అని అన్నాడు.

ధోనిపై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్

ధోనిపై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్

ఇక, ధోని లాంటి కెరీర్ ఎంతమంది ఆటగాళ్లకు ఉంటుందని సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ధోనీలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది?. అతడిది ఓ ప్రత్యేకమైన కెరీర్. అభిమానులు అతడికి ఇచ్చిన మద్దుతు, పెట్టుకున్న నమ్మకం అతడి కృషికి ప్రతిబింబం. ఇప్పటికీ అభిమానులు అతడు గేమ్‌ను ఫినిష్ చేయగలడని భావిస్తున్నారు. గేమ్ ఇప్పటికీ ముగియలేదు" అని సచిన్ అన్నాడు.

9 మ్యాచ్‌లు ఆడిన 273 పరుగులు

9 మ్యాచ్‌లు ఆడిన 273 పరుగులు

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ధోని 45.5 యావరేజితో 273 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగులు రాబట్టేందుకు ధోని తెగ ఇబ్బంది పడ్డాడు. ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగాడు.

జడేజాతో కలిసి ధోని 106 పరుగుల భాగస్వామ్యం

జడేజాతో కలిసి ధోని 106 పరుగుల భాగస్వామ్యం

అయితే, బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో రవీంద్ర జడేజాతో కలిసి ధోని 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన వేళ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) సమయోచితంగా ఆడాడు.

Story first published: Thursday, July 11, 2019, 15:14 [IST]
Other articles published on Jul 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+