Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండండి.. చివరి శ్వాస వరకు పోరాడతా

ICC Cricket World Cup 2019 : ''I Will Keep Giving My Best Till My Last Breath'' : Ravindra Jadeja
CC Cricket World Cup 2019, India vs New Zealand: I will give my best till my last breath says Ravindra Jadeja

నాకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉండండి. నా చివరి శ్వాస వరకు పోరాడుతా అని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు:

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు:

లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల దాటికి భారత టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ వరుసగా పెవిలియన్ చేరారు. ఐదు పరుగులకే రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీలు ఔట్ అయ్యారు. ఈ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు కొద్దిసేపు పోరాడినా.. చెత్త షాట్లు ఆడి ఔట్ అయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. తనదైన స్థాయిల్లో బ్యాట్ జులిపించి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

బ్యాటింగ్‌లోనే కాదు:

బ్యాటింగ్‌లోనే కాదు:

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1X6)తో కలిసి వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువవడంతో భారీ షాట్‌ ఆడబోయిన జడేజా.. కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ చేతికి చిక్కి నిరాశగా డగౌట్ చేరుకున్నాడు. అనంతరం ధోనీ రనౌట్‌ అవ్వడంతో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జడేజా బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌ కూడా అదరగొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

చివరి శ్వాస వరకు పోరాడతా:

చివరి శ్వాస వరకు పోరాడతా:

తాజాగా జడేజా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ప్రతి పతనం తర్వాత ఎలా పోరాడాలనేది క్రికెటే నాకు నేర్పింది. నాకు స్ఫూర్తి కలిగించిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్నది. నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉండండి. నా చివరి శ్వాస వరకు పోరాడతా' అని జడేజా ట్వీటాడు. దీంతో జడేజాపై అభిమానులు మరిన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు.

తప్పని నిరూపించాడు:

తప్పని నిరూపించాడు:

గతంలో జడేజాపై విరుచుకుపడ్డ సంజయ్‌ మంజ్రేకర్‌ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'ఈ రోజు జడేజా తన ఆటతో నన్ను ముక్కలు ముక్కలు ( బిట్స్ అండ్ పీసెస్) చేసాడు. అద్భుత బ్యాటింగ్‌తో తన వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. గత 40 ఇన్నింగ్స్‌లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమే. గతంలో ఇలాంటి జడేజాను ఎప్పుడూ చూడలేదు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు' అని మంజ్రేకర్‌ అన్నాడు.

Story first published: Thursday, July 11, 2019, 17:19 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+