For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెప్పినట్టు వేయండి: చాహల్, కుల్దీప్‌లతో ధోని, స్టంప్‌ మైక్‌లో రికార్డు

87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ధోని... పాండ్యాతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది. 
 ఆసీస్ బ్యాటింగ్ సమయంలో కూడా ధోని తన విలువైన సూచలన

By Nageshwara Rao

హైదరాబాద్: చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇద్దరు స్పిన్నర్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరులుగు చేసింది.

అయితే, భారత్ ఇన్నింగ్స్ ఆనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో 21 ఓవర్లకు మ్యాచ్‌ని కుదించి ఆసీస్ లక్ష్యాన్ని 167 పరుగులుగా నిర్ధారించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా వరుస వికెట్లను కోల్పోతూ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Caught on stump mic! MS Dhoni’s razor-sharp advice to Yuzvendra Chahal, Kuldeep Yadav

అయితే ఆసీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో చాహల్, కుల్దీప్ కీలకపాత్ర పోషించారు. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ స్టొయినిస్‌ను కుల్దీప్‌ పెవిలియన్‌కు పంపగా... భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగిన మాక్స్‌వెల్‌, మాథ్యూవేడ్‌, కమిన్స్‌ను యజువేంద్ర చాహల్‌ పెవిలియన్‌కు పంపాడు.

87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ధోని... పాండ్యాతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో కూడా ధోని తన విలువైన సూచలను స్పిన్నర్లకు అందజేశాడు. ధోని ఇచ్చిన సూచనలు స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి.

అవేంటంటే?

'వో మార్నే వాలా దాల్‌నా; అందర్‌ యా బాహర్‌ కోయీ భీ (షాట్‌ కొట్టే బంతి వేయి; వికెట్ల వైపు లేదా వెలుపలికి టర్న్‌ అయినా ఫర్వాలేదు), ఘూమ్నే వాలా దాల్‌ ఘూమ్నే వాలా దాల్‌ (టర్న్‌ అయ్యే బంతి వెయ్యి)' అని చాహల్‌కు ధోనీ సలహా ఇవ్వడం స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి.

తొలి వన్డేలో మ్యాక్స్‌వెల్ సిక్సర్లతో చెలరేగుతున్న సమయంలో అతన్ని అవుట్ చేసేందుకు 'స్టంప్‌ పే మత్‌ దాల్‌ (నేరుగా స్టంప్స్‌కు వేయకు), అరే బాహర్‌ దాల్‌, ఇస్కో ఇత్నా ఆగే నహీ (బంతిని దూరంగా ఔట్‌ సైడ్‌ది ఆఫ్‌ స్టంప్‌ వెయ్యి మరీ ఫుల్‌ కాదు' అని చాహల్‌కు చెప్పాడు.

అయితే ధోని అనుకున్న చోటు చాహల్ బంతి వేయకపోవడంతో 'ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (వినడం లేదా, చెప్పినట్టు వెయ్యి)' అని గట్టిగా చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+