న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 ఏళ్ల తర్వాత కోహ్లీని కలిసి టిప్స్ తీసుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్

By Nageshwara Rao
Virat Kohli Catches Up With Varun Chopra After 12 Years
Catching up with Virat Kohli after 12 years: The story of Varun Chopra

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎసెక్స్ క్రికెట్ క్లబ్ తరుపున ఆడుతున్న వరుణ్ చోప్రాకి సలహాలు, సూచనలు ఇచ్చాడు. సుదీర్ఘ టెస్టు సిరిస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్‌ జట్టుతో తలపడుతోంది. ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌ జట్టు తరఫున ఆడుతోన్న వరుణ్‌ చోప్రా.. కెప్టెన్ కోహ్లీ నుంచి విలువైన సలహాలు, సూచనలు అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

వీడియోలో వరుణ్ చోప్రా భారత్‌ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్న సమయంలో కోహ్లీని కలిశాడు. ఇద్దరూ కాసేపు క్రికెట్‌ గురించి మాట్లాడుకున్నారు. బ్యాటింగ్‌కు సంబంధించి కొన్ని సూచనలు, సలహాలను కోహ్లీ నుంచి తీసుకున్నట్లు వరుణ్ చోప్రా తెలిపాడు. వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్ లాంటి సీనియర్‌ బౌలర్లను ఎదుర్కోవడం ప్రత్యేకంగా ఉందని అన్నాడు.

చివరిసారిగా విరాట్ కోహ్లీని వరుణ్ చోప్రా ఇంగ్లాండ్ అండర్-19 జట్టు తరుపున ఆడినప్పుడు కలిశాడు. అప్పట్లో కోహ్లీ భారత అండర్-19 జట్టుకు సారథ్యం వహించగా... వరుణ్ చోప్రా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుకు సారథిగా వ్యవహారించాడు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇద్దరూ వార్మప్ మ్యాచ్ సందర్భంగా కలుసుకున్నారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. అంతేకాదు మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే వరుణ్ చోప్రా విషయానికి వస్తే ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

ఇంగ్లాండ్ తరుపున 183 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 9868 పరుగులు సాధించాడు. ఇందులో 20 సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, July 27, 2018, 18:22 [IST]
Other articles published on Jul 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X