Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వోక్స్ ఆ క్యాచే పట్టి ఉంటే: ఉతికేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్ ఫించ్

మెల్నోర్ప్: వన్డే క్రికెట్ మ్యాచుల్లో చిన్న పొరపాటు కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంగ్లాండుకు అటువంటి పరిస్థితే ఎదురైంది. ప్రపంచ కప్ వన్డే పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో వోక్స్ పట్టుకోలేకపోయాడు.

ఇంగ్లాండు పేసర్ అండర్సన్ వేసిన ఐదో బంతిని ఫించ్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టబోయాడు. ఇంగ్లాండు ఫీల్డర్ వోక్స్ తల మీదుగా అది వెళ్లింది. నిజానికి అది అత్యంత సులభమైన క్యాచ్. కాని వోక్స్ పట్టలేకపోయాడు. అప్పటికి ఫించ్ ఖాతా కూడా తెరవలేదు. ఐదో బంతికి రెండు పరుగులు తీసిన ఫించ్ ఆ తర్వాత వెనదిరిగి చూడలేదు.

Catch dropped by England player imn match against Austrlia

అద్భుతమైన సెంచరీ చేసి ఫించ్ ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించాడు. ఫించ్‌ను అవుట్ చేసి ఉంటే ఇంగ్లాండు పరిస్థితి మరో విధంగా ఉండేది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్ 5, బ్రాడ్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఫించ్ 102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో వంద పరుగులు పూర్తిచేశాడు. ఫించ్‌కు ఈ ప్రపంచ్‌కప్‌లో ఇది తొలి సెంచరీ. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ బెయిలీ అర్ధ శతకం నమోదు చేశాడు. అర్ధ సెంచరీ సాధించిన కెప్టెన్‌ బెయిలీ 55 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు వద్ద ఫిన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+