Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాసినోలో పడి ఉన్న క్రికెటర్లు: స్టోక్స్, మెకల్లమ్ మధ్య రచ్చరచ్చ!

AUS vs ENG: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 4-1తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే కూడా జట్టు క్రమశిక్షణ, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు నివేదికలు చెబుతున్నాయి. 'ది టెలిగ్రాఫ్ ' నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆటగాళ్లు మైదానంలో కంటే క్యాసినో టేబుళ్ల వద్దే ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తోంది.

క్యాసినోలో మకాం
ఇంగ్లాండ్ జట్టు బస చేసిన 'క్రౌన్ టవర్స్' హోటల్ ఓ విలాసవంతమైన క్యాసినో కాంప్లెక్స్. ఆటగాళ్లు పదేపదే క్యాసినోకు వెళ్తూ, మద్యం సేవిస్తూ అభిమానుల కంటపడ్డారు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కగా.. ఓపెనర్ బెన్ డకెట్ మద్యం మత్తులో కనీసం టాక్సీ కూడా ఎక్కలేనంత స్థితిలో ఉన్న వీడియో వైరల్ అయ్యింది. కొందరు ఆటగాళ్లు వరుసగా ఆరు రోజుల పాటు మద్యం సేవించినట్లు సమాచారం. ఇది వారి ఫిట్‌నెస్, ఆటపై తీవ్ర ప్రభావం చూపింది.

Casino Controversy in Ashes Ben Stokes vs Brendon McCullum Clash Exposed

బెన్ స్టోక్స్ vs బ్రెండన్ మెకల్లమ్: ముదిరిన వివాదం
2022 నుంచి కలిసి పనిచేస్తున్న కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మధ్య సంబంధాలు ఈ సిరీస్ సందర్భంగా దెబ్బతిన్నాయి. బ్రిస్బేన్ డే-నైట్ టెస్టుకు ముందు స్టోక్స్ కఠినమైన శిక్షణ కోరుకోగా.. మెకల్లమ్ మాత్రం ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి వారిపై ఒత్తిడి తగ్గించాలని భావించారు. ఆస్ట్రేలియా టెయిల్ ఎండర్లను ఔట్ చేయడంలో స్టోక్స్ అనుసరించిన రక్షణాత్మక వ్యూహాలు మెకల్లమ్‌కు నచ్చలేదు. స్టోక్స్ ఒత్తిడిలో తడబడుతున్నాడని మెకల్లమ్ భావించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. స్టోక్స్ జట్టులోని ఆటగాళ్లను 'బలహీనులు' అని విమర్శించగా, మెకల్లమ్ మాత్రం జట్టు అవసరానికి మించి ప్రాక్టీస్ చేసిందని భిన్నమైన ప్రకటనలు ఇచ్చారు.

ముగిసిన 'బ్యాజ్‌బాల్' శకం?
ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ కేవలం 11 రోజుల్లోనే యాషెస్ ట్రోఫీని కోల్పోయింది. ఆటగాళ్లలో పెరిగిన మద్యం అలవాట్లు, జూదం, మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయ లోపం వెరసి ఇంగ్లాండ్ క్రికెట్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. ఈ వైఫల్యం తర్వాత బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని వార్తలు వస్తున్నాయి.

Story first published: Tuesday, January 13, 2026, 10:09 [IST]
Other articles published on Jan 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+