Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఔటైన కోపంలో హెల్మెట్‌ను సిక్సర్‌గా బాదిన బ్రాత్‌వైట్ (Video)

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. నాటౌట్ అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో తన హెల్మెట్‌ను బ్రాత్‌వైట్ సిక్సర్‌గా బాదాడు. ఈ సంఘటన మాక్స్ 60 కరేబియన్ టీ10 టోర్నమెంట్‌లో జరిగింది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న బ్రాత్‌వైట్ గ్రాండ్ కేమన్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు.

అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయిదు బంతుల్లో ఏడు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే అతని ఔట్ వివాదాస్పదంగా మారింది. ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోషువా లిటిల్ వేసిన షార్ట్ బాల్‌ను బ్రాత్‌వైట్ భారీషాట్‌‌కు యత్నించాడు. అయితే బంతి బ్యాటుకు తగలకుండా తన భుజానికి తగలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది.

Carlos Brathwaite Smashes His Own Helmet for a Six

కానీ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో బ్రాత్‌వైట్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. కోపంతో మైదానాన్ని వీడుతూ తన హెల్మెట్‌ను బ్యాటుతో బలంగా కొట్టాడు. అది తమ జట్టు డగౌట్‌పై నుంచి వెళ్తూ దూరంగా పడింది. అనంతరం బ్రాత్‌వైట్ రోప్‌ను దాటిన తర్వాత బ్యాటును నేలకు విసిరికొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే దీనిపై వెస్టిండీస్ మాజీ అసిస్టెంట్ కోచ్ స్పందించాడు. బ్రాత్‌వైట్ బలంతో పాటు టెక్నిక్‌గా హెల్మెట్ కొట్టిన తీరును వివరించాడు. ఎడమకాలును ముందు ఉంచుతూ, చేతుల్లో బలాన్ని పెంచుతూ, గాల్లో ఉన్న హెల్మెట్‌కు తగ్గట్లుగా షాట్ ఆడాడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2016 ఫైనల్‌లో ఆఖరి ఓవర్‌లో బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ ప్రాతినిథ్యం వహించిన న్యూయార్క్ స్ట్రైకర్స్ విజయం సాధించింది.

Story first published: Monday, August 26, 2024, 13:21 [IST]
Other articles published on Aug 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+