Mayank Agarwal: ఎవర్నీ కెప్టెన్ చేయాలనేదానిపై ఫ్రాంఛైజీలు కాస్త మైండ్ పెట్టాలంటూ రవిశాస్త్రి హితబోధ

అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరొందినప్పటికీ పంజాబ్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో నిరాశపరిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ ఏడు గెలవగా, మిగిలిన ఏడింటిలో ఓడిపోయింది. తద్వారా 14పాయింట్లను పొందినప్పటికీ ఆ జట్టు ప్లేఆఫ్ చేరకపోవడానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరోస్థానంలో మిగిలి పోయింది. ఇకపోతే ఆ జట్టు పతనానికి అతిపెద్ద కారణం ఏమిటంటే.. ఆ జట్టులోని కొందరు స్టార్ ఆటగాళ్లు గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడకపోవడమే. అయినప్పటికీ కొందరు స్టార్లు రాణించడం ఆ జట్టుకు కొంత సానుకూలాంశం. విఫలమైన స్టార్ ఆటగాళ్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒకడు. అతను గత సీజన్లలో ఎంతో రాణించినప్పటికీ ప్రస్తుత సీజన్లో మాత్రం పేలవ ఆటతీరు కనబరిచాడు.

కెప్టెన్ అయినప్పటి నుంచి తేడా కొట్టిన ఆట
కెప్టెన్‌గా అయినప్పటి నుంచి మయాంక్ అగర్వాల్ ఆట తేడా కొట్టింది. అసలు ధాటిగా బ్యాట్ ఝళిపించలేకపోయాడు. ఇక ఈ సీజన్లో 16.33 పేలవమైన సగటుతో బ్యాటింగ్ చేశాడు. 12ఇన్నింగ్స్‌ల నుండి 196పరుగులు మాత్రమే చేశాడు. ఇకపోతే మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ వైఫల్యాన్ని రవిశాస్త్రి విశ్లేషించాడు. జట్టును నడిపించే అదనపు బాధ్యత వల్ల అతని ప్రదర్శన దెబ్బతిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

అందుకే టీమిండియాకు సెలెక్ట్ కాలేదు
ఈ ఐపీఎల్లో కెప్టెన్ కావడం, తద్వారా రాణించకపోవడం వల్లే మయాంక్ అగర్వాల్ టీమిండియా టెస్ట్, టీ20 జట్టుకు సెలక్ట్ కాలేకపోయాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని పేర్కొన్న రవిశాస్త్రి.. కెప్టెన్లుగా మారిన తర్వాత వారు తమ ఆటను కోల్పోయారని పేర్కొన్నాడు. ఇకపోతే ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. తన విశ్లేషణలో ఫ్రాంఛైజీలకు కెప్టెన్లను ఎంపిక చేయడంతో పలు సూచనలు చేశాడు.

ఫ్రాంఛైజీలు ఆచితూచి వ్యవహరించాలి
'ఎప్పుడూ కెప్టెన్లుగా వ్యవహరించని ప్లేయర్లను కెప్టెన్లుగా నియమించే ముందు ఫ్రాంచైజీలు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇది మయాంక్‌ను అగౌరవపరచడం కాదు. ఎందుకంటే నేను అతన్ని బాగా ఇష్టపడతాను. అతను క్రికెట్ ఎలా ఆడతాడో, అతను ఎంత దృఢంగా షాట్లు కొట్టగలడో నాకు తెలుసు. ప్లేయర్‌గా అతను బ్రహ్మాండంగా ఆడగలడు. కానీ అతన్ని కెప్టెన్‌గా చేయడంతో బర్డెన్ పెరిగిపోయింది. అప్పుడు ఏమి చేయగలడు. కెప్టెన్సీ వల్ల అతను కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని ఆట దెబ్బతింది. తద్వారా అతను భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. సెలెక్టర్లు ప్రస్తుత ఫామ్‌ను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఓ ప్లేయర్‌ను కెప్టెన్సీ ఇచ్చి అతని ఫామ్ దెబ్బతినేలా చూడకుండా ఫ్రాంచైజీలు వ్యవహరించాలి' అని రవిశాస్త్రి విశ్లేషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications