కలలా ఉంది: మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీపై కోహ్లీ
హైదరాబాద్: మూడు ఫార్మెట్లలో టీమిండియాకు నాయకత్వం వహిస్తానని తాను ఎప్పుడు అనుకోలేదని, ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుందని కూడా తాను ఎప్పుడూ అనుకోలేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన విరాట్ కోహ్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు.
'నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను జట్టులోకి వచ్చినప్పుడు చక్కగా రాణించాలని, మరిన్ని అవకావాలు అందిపుచ్చుకుని నిలకడైన కెరీర్‌ను రూపొందించుకోవడానికి, జట్టు మ్యాచ్‌లు గెలిచేందుకు నా వంతు సేవలు అందించడానికే ప్రయత్నించాను' అని కోహ్లీ చెప్పాడు.
వన్డే, ట్వంటీ 20 ఫార్మాట్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మొన్నటివరకు టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా ఉండిన విరాట్ కోహ్లీని అన్ని ఫార్మాట్‌లలోను కెప్టెన్‌గా గత వారంలో నియమించిన సంగతి తెలిసిందే.

మందిరాబేడీతో టాక్‌షోలో కోహ్లీ
బుధవారం పుణెలో ఒక మాల్‌ను ప్రారంభించిన తర్వాత కోహ్లీ మందిరాబేడీతో టాక్‌షోలో పాల్గొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్నందుకు ఎలాంటి భావన కలుగుతుందని అడిగినప్పుడు ‘అంతా దేవుడు ఇచ్చిందే అన్నది నా ఉద్దేశం. మనకు ఏం జరిగినా దానికి ఓ కారణముంటుంది. ఏదైనా జీవితంలో సరైన సమయంలో జరుగుతుంది' అని చెప్పాడు.

టీమిండియాకు కెప్టెన్‌గా ఉండడం పూర్తిగా భిన్నమైంది
జూనియర్ స్థాయిలో తాను ఆడిన జట్టుకు కెప్టెన్‌గా ఉండే వాడినని, అయితే టీమిండియాకు కెప్టెన్‌గా ఉండడం దానికి పూర్తి భిన్నమైందని, అది ఒక హాట్‌సీట్‌లాంటిదని అందరి దృష్టి కెప్టెన్‌పైనే ఉంటుందని, అలా ఉండడంతో పాటుగా పొగడ్తలు, విమర్శలు అన్నిటినీ ఎదుర్కోవవలసి ఉంటుందని కోహ్లీ చెప్పాడు.

ఓ మంచి క్రికెటర్‌గా, వ్యక్తిగా తయారుకావడానికి తోడ్పడుతుంది
అయితే ఈ బాధ్యత తాను జీవితంలో ఓ మంచి క్రికెటర్‌గా, వ్యక్తిగా తయారుకావడానికి తోడ్పడుతుందని మాత్రం చెప్పగలనని అన్నాడు. కాగా, భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఒత్తిడిగా భావిస్తున్నారా అని అడగ్గా, ఇది ఒత్తిడితో కూడుకున్న పనని తాను చెప్పలేను కానీ, ఎంజాయ్ చేసేదని అన్నాడు.

సీనియర్ ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్‌గా ఉండడం కష్టమా?
మీకన్నా సీనియర్ ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్‌గా ఉండడం కష్టమా అని అడగ్గా, అదొక ‘ప్రివిలేజ్' అని కోహ్లీ చెప్పాడు. ప్రపంచ కప్‌లో జట్టుకు నాయకత్వం వహించడానికి ఉత్సుకతతో ఉన్నారా? అని అడగ్గా, అది ఇంకా చాలా దూరంలో ఉందని కోహ్లీ తెలిపాడు.

నెంబర్‌వన్ స్థానానికి చేరువలో కోహ్లీ
ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ కోహ్లి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం 848 పాయింట్లతో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. 861 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తాచాటితే విరాట్ కోహ్లి నంబర్‌వన్ ర్యాంకుని దక్కించుకునే అవకాశాలున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications