
రేసు రసవత్తరంగా:
మిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చివరి గడువు మంగళవారంతో ముగిసింది. ఈ పదవి కోసం రేసు రసవత్తరంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ, సీనియర్ కోచ్ టామ్ మూడీ కూడా కోచ్ రేసులో ఉన్నారు. తాజాగా కోచ్ స్థానం కోసం భారత మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ కూడా పోటీలోకి వచ్చాడు. అయితే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగాలని కోహ్లీ ఆశిస్తున్నాడు.

కోహ్లీ ప్రమేయం ఉండదు:
హెడ్ కోచ్ పదవిని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీ ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమేయం ఏమీ ఉండదని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధికారుల గైడ్‌లైన్స్ మేరకే హెడ్ కోచ్ ఎంపికకానున్నాడు. కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగాలని కోహ్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అన్షుమన్ గైక్వాడ్ స్పందించారు.

బీసీసీఐ గైడ్‌లైన్స్ మేరకే:
అన్షుమన్ గైక్వాడ్ మాట్లాడుతూ... 'విరాట్ కెప్టెన్. కెప్టెన్ ఏదైనా చెప్పగలడు. అవి మమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయవు. మేము ఒక కమిటీ. కోహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది కానీ.. మేం కాదు. కోచ్ ఎంపిక మొత్తం బీసీసీఐపైనే ఆధారపడి ఉంటుంది. బీసీసీఐ ఇచ్చే గైడ్‌లైన్స్ మేరకే మా ఎంపిక ఉంటుంది. మహిళా జట్టు కోచ్‌ను ఎంపిక చేసినప్పుడు.. మా విధానంలోనే ఎంపికచేశాం' అని అన్షుమన్ తెలిపాడు.

ఏది కావాలో మాకు తెలుసు:
'ఓపెన్ మైండ్‌తోనే హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ చేపడుతాం. దేశ, విదేశాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అందరి సామర్ధ్యాన్ని పరిశీలించాలి. నేను, కపిల్ ఇద్దరం కోచ్‌గా పనిచేసినవాళ్లమే. జట్టుకు ఏది కావాలో మాకు తెలుసు. ప్రస్తుత కోచ్ జట్టు బాగానే నడిపించాడు. ఇంకా బాగా ఆడాల్సింది. కోచ్ ఎంపిక ప్రక్రియలో ఆటగాళ్లను సమన్వయపరచడం, ప్రణాళికలు రచించంచడం, సాంకేతికంగా అనుభవం కలిగి ఉండటం వంటి మూడు లక్షణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మూడు లక్షణాలు ఉన్నవారే కోచ్‌గా ఎంపికవుతాడు' అని గైక్వాడ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












