Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2021లో కోహ్లీ ఎన్ని ర‌న్స్ చేశాడు? ఫీల్డింగ్ సంగ‌తేంటి? ఓ లుక్కేయండి!

Captain Virat kohli Runs and Fielding records in 2021

2021వ‌ సంవ‌త్స‌రం మ‌రొక రోజులో ముగియ‌నుంది. దీంతో క్రికెట్ అభిమానులు త‌మ బుర్ర‌ల‌కు ప‌ని చెబుతున్నారు. త‌మ‌లోని లెక్క‌ల మాష్ట‌ర్‌ను నిద్ర లేపుతున్నారు. త‌మ‌దైన రీతిలో క్రికెట్‌లోని ప‌రుగులు, వికెట్ల లెక్క‌లు క‌డుతున్నారు. ఇవే కాదండోయ్.. ఫీల్డింగ్ లెక్క‌లు కూడా వేస్తున్నారు. అస‌లు ఈ ఏడాది ఎవ‌రు ఎన్ని క్యాచ్‌లు ప‌ట్టార‌ని లెక్క‌లు బ‌య‌టికి తీస్తున్నారు. స్టార్ ఆట‌గాడి నుంచి అనామ‌క ఆట‌గాడి వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌డం లేదు. అనామ‌క ఆట‌గాళ్ల‌నే వ‌దిలి పెట్ట‌డం లేదంటే ఇక టీమ్ కెప్టెన్‌ల‌ను వ‌దిలి పెడ‌తారా? అందులోనూ టీమిండియా కెప్టెన్‌ను వ‌దిలి పెడ‌తారా? అస‌లు వ‌దిలిపెట్ట‌రు.

ఈ ఏడాది విరాట్ కోహ్లీ అంత‌గా రాణించ‌లేద‌ని తెలిసినప్ప‌టికీ మ‌న కెప్టెన్ ఈ ఏడాది చేసిన ప‌రుగుల లెక్క‌ల‌ను వెతికి వేటాడి మ‌రి బ‌య‌టికి తీస్తున్నారు. ప‌రుగులు ఒక్క‌టే కాదండోయ్‌.. ఈ ఏడాది విరాట్ భాయ్ ఎన్ని క్యాచ్‌లు పట్టాడు. అస‌లు ఈ ఏడాది బౌలింగ్ ఏమైనా చేశాడా? చేస్తే ఏమైనా వికెట్లు ప‌డ్డాయా? అని నెట్టింట్లో క్షుణ్ణంగా వెతుకుతున్నారు. దీంతో అస‌లు ఈ ఏడాది కోహ్లీ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని ర‌న్స్ చేశాడు, ఎన్ని క్యాచ్‌లు ప‌ట్టాడు అనే వెతుకులాట‌ నెట్టింట్లో ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

కోహ్లీ ఓవ‌రాల్ ర‌న్స్‌

కోహ్లీ ఓవ‌రాల్ ర‌న్స్‌

ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లో క‌లిపి 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 30 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. 37 స‌గ‌టుతో 964 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 హాఫ సెంచ‌రీలు ఉండ‌గా ఒక్క‌సారి కూడా సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు.

కోహ్లీ సెంచ‌రీలు కొట్ట‌డం ప్రారంభించాక సెంచ‌రీ లేని రెండో సంవ‌త్స‌రంగా 2021 నిలిచిపోయింది. కోహ్లీ గ‌త సంవ‌త్సరం కూడా సెంచ‌రీ చేయ‌లేదు. అత్య‌ధికంగా స్కోర్ 80 మాత్ర‌మే. ఈ ఏడాది మొత్తంగా అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 1590 బంతులు ఎదుర్కొని 60 స్టైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు ఈ ర‌న్ మెషీన్‌. మొత్తంగా 95 ఫోర్లు బాద‌గా, 12 సిక్స్‌లు కొట్టాడు.

టెస్టుల్లో కోహ్లీ స్కోర్‌

టెస్టుల్లో కోహ్లీ స్కోర్‌

2021 ఏడాదిలో 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 19 ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 28 సగ‌టుతో 536 ప‌రుగులు చేశాడు. 1216 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 44 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 72. 60 ఫోర్లు బాదిన కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో ఒకే ఒక్క సిక్స్ కొట్టాడు.

వ‌న్డేలు మూడు మాత్రమే

వ‌న్డేలు మూడు మాత్రమే

ఈ ఏడాది 3 వ‌న్డే మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన కోహ్లీ 43 స‌గ‌టుతో 129 ప‌రుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకోగా అత్య‌ధికంగా 66 ప‌రుగులు చేశాడు. మొత్తంగా 149 బంతులు ఎదుర్కొని 86 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 10 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.

టీ20ల్లో చెల‌రేగిన కోహ్లీ

టీ20ల్లో చెల‌రేగిన కోహ్లీ

ఈ ఏడాది టెస్టుల్లో, వ‌న్డేల్లో విఫ‌ల‌మైన కెప్టెన్ కోహ్లీ టీ20ల్లో మాత్రం చెల‌రేగాడు. మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 74 స‌గ‌టుతో 299 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోర్ 80 నాటౌట్. ఇందులో 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 25 ఫోర్లు బాదిన కోహ్లీ 10 సిక్సులు కొట్టాడు. 225 బంతులు ఎదుర్కొని 132 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

కోహ్లీ ఫీల్డింగ్‌

కోహ్లీ ఫీల్డింగ్‌

ఈ ఏడాది కోహ్లీ ఒక్క ఓవ‌ర్ కూడా బౌలింగ్ చేయ‌లేదు. అయితే ఈ ఏడాది 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో ఫీల్డింగ్ చేశాడు. మొత్తంగా 17 క్యాచ్‌లు ప‌ట్టాడు. దీంతో 17 మందిని ఔట్ చేయ‌డంలో కోహ్లీ భాగ‌స్వామ్యం అయ్యాడు. టెస్టుల్లోనే అత్య‌ధికంగా 14 క్యాచ్‌లు ప‌ట్టాడు. ఆడిన మూడు వ‌న్డేల్లో మూడు క్యాచ్‌లు పట్టి ముగ్గురిని ఔట్ చేయ‌డంలో భాగ‌స్వామ్యం అయ్యాడు. అయితే 10 టీ20ల్లో ఒక్క క్యాచ్ కూడా ప‌ట్ట‌లేదు.

Story first published: Thursday, December 30, 2021, 12:55 [IST]
Other articles published on Dec 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+