
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే ఇటీవల హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకురిస్తూ కోహ్లీ ఆదివారం నెట్స్ సెషన్‌లో పాల్గొన్నాడు. బ్యాట్ పట్టుకోని చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. కవర్ డ్రైవ్‌లు, ఆఫ్ డ్రైవ్‌లు ఆడాడు. దీంతో కెప్టెన్‌గా కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడని అర్థమవుతుంది. దీంతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయినా మూడో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులతోపాటు భారత జట్టు అభిమానులంతా తెగ ఖుషీ అవుతున్నారు. కాగా వెన్ను నొప్పితో రెండో టెస్టు మ్యాచ్‌కు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీమిండియా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇరు జట్ల మధ్య ఈ నెల 11 నుంచి 15 మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందు కోసం శనివారం కేప్‌టౌన్ చేరుకున్న భారత జట్టుకు అక్కడ మంచి ఆహ్వానం లభించింది. కాగా సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఇరు జట్లు చెరోటి గెలుచుకున్నాయి. తొలి టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో టెస్టులో సఫారీలు 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో మూడో టెస్టు మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం కూడా ఆధారపడి ఉంది. అందుకే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక టెస్టు సిరీస్ ముగిశాక ఇరు జట్లు 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా తలపడనున్నాయి. అనంతరం టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉన్నప్పటికీ సౌతాఫ్రికాలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా వాయిదా పడింది.
కాగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సెకండ్ టెస్టుకు వెన్నునొప్పితో దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంతో హనుమ విహారీ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అలాగే జోహన్నెస్‌బర్గ్ టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆడే అవకాశం ఉంది.