Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: రిషబ్ పంత్ జట్టుకు ఏం కావాలో అర్థం చేసుకో.. రోహిత్ శర్మ..!

మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ లో ఇండియా 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఆట తీరుపై కూడా రోహిత్ మాట్లాడాడు. రిషబ్ పంత్ తన ఆటలో రిస్క్ శాతాన్ని గుర్తించాలని సూచించాడు. అతని నుంచి ఏమి అవసరమో అర్థం చేసుకోవాలి అని శర్మ పేర్కొన్నాడు. " మేమంతా నిరాశ చెందాం. అతని నుంచి ఏమి అవసరమో పంత్ అర్థం చేసుకోవాలి. ఏం అవసరమో అతనే అర్థం చేసుకోవాలి" అని అన్నాడు.

బాక్సింగ్ డే టెస్ట్ లో రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్ లో 28 పరుగులు చేశాడు. అప్పుడు ఫీల్డర్ ఉన్నా అటు వైపు షాట్ కొట్టి ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదీ ఏమి ఆటా అంటూ ప్రశ్నించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. అక్కడ ఫీల్డర్లు ఉన్నప్పుడు అటు వైపే షాట్ ఎలా ఆడతావు అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా పంత్ నిర్లక్ష్యంగా ఆడినట్లు కనిపించింది.

Captain Rohit Sharma reacts to Rishabh Pant s performance in the Melbourne Test

పార్ట్ టైమ్ బౌలర్ హెడ్ బౌలింగ్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 140 పరుగులు చేశాడు. కోస్ స్టాస్, ఖవాజా, లబుషగే హాఫ్ సెంచరీలు చేశాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసింది. లబుషగే 70 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా మరోసారి విఫలమయ్యారు. ఆ తర్వాత రిషబ్ పంత్ తో జైస్వాల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశాడు. పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన జడేజా, నితీష్ కుమార్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేదు. జైస్వాల్ ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది.

Story first published: Monday, December 30, 2024, 17:09 [IST]
Other articles published on Dec 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+