
గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ బెంగళూర్‌లోని ఎన్‌సీఏ అకాడమీలో కోలుకుంటున్నాడు. కాగా హిట్‌మ్యాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో పోస్ట్ చేసిన తన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో హిట్‌మ్యాన్ ఎప్పుడు లేనంత కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ చేసుకున్న రోహిత్.. మీసాలను కూడా పూర్తిగా తీసేశాడు. ఆకుపచ్చ రంగు టీషర్టు, నలుపు రంగు టోపీ ధరించాడు. ఫ్రెష్ లుకులో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్‌సీఏలో బరువు తగ్గేందుకు కృషి చేస్తున్న హిట్‌మ్యాన్ సానుకూల ఫలితం సాధించినట్లు ఈ ఫోటోలో తెలుస్తుంది. రోహిత్ శర్మ గతం కంటే బరువు తగ్గినట్టు ఈ ఫోటోలో అర్థమవుతుంది. దీంతో గతం కన్న భిన్నంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిమ్‌గా కనిసిస్తున్నాడు. దీనికి తీడు క్లీన్ సేవింగ్‌తో కనిపించడం ఆకట్టుకుంటుంది. క్లీన్ షేవ్ ఉండడంతో రోహిత్ శర్మ ముఖం గతం కంటే ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనిపించడం ఈ ఫోటోలో చూడవచ్చు. దీంతో రోహిత్ న్యూలుక్‌పై అభిమానులతోపాటు క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్‌శర్మను సెలెక్టర్లు టీమిండియా పరిమిత ఓవర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్‌ల టీట్వంటీ సిరీస్‌కు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంది. ఆ తర్వాత కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో సౌతాఫ్రకా పర్యటన మొత్తానికే రోహితశర్మ దూరమయ్యాడు. దీంతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా, వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సెలెక్టర్లు లోకేష్ రాహుల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఎలో కోలుకుంటున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో మంచి విజయాలే సాధించినప్పటికీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. దీంతో ఆ లోటును రోహిత్ శర్మ తీరుస్తాడని అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలిసిందే.