Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుడ్ న్యూస్! ఫిట్‌నెస్ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ‌ పాస్‌.. విండీస్‌తో పోరుకు రెడీ

Captain Rohit Sharma has passed the fitness Test

బెంగ‌ళూరు: టీమిండియా అభిమానుకు గుడ్ న్యూస్‌. గాయంతో బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ అకాడ‌మీలో కోలుకుంటున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నేడు నిర్వ‌హించిన ఫిట్‌నెస్ టెస్టులో పాస‌య్యాడు. దీంతో స్వ‌దేశంలో విండీస్‌తో జ‌రిగే వ‌న్డే, టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండ‌నున్నాడు. కాగా గాయం కార‌ణంగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న మొత్తానికి రోహిత్‌శ‌ర్మ దూర‌మైన సంగ‌తి తెలిసిందే.

 గాయంతో ఔట్‌

గాయంతో ఔట్‌

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు స‌న్న‌ద్ధం అవుతున్న నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. అత‌ని తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. నిజానికి ఈ గాయం రోహిత్‌శ‌ర్మ‌కు గ‌తంలో కూడా ఉంది. ఆ త‌ర్వాత కోలుకోని మ‌ళ్లీ మ్యాచ్‌లు ఆడి స‌త్తా చాటాడు. కానీ సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ కోసం ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో హిట్‌మ్యాన్‌కు తొడ కండ‌రాల గాయం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టింది. దీంతో చేసేదేమి లేక సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మ‌య్యాడు. మొద‌ట టెస్టు సిరీస్ వ‌ర‌కు మాత్ర‌మే దూరంగా ఉంటాడ‌ని, వ‌న్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడ‌ని అంతా భావించారు. కానీ వ‌న్డే సిరీస్ నాటికి రోహిత్ శ‌ర్మ కోలుకోక‌పోవ‌డంతో దూరం కాక త‌ప్ప‌లేదు.

బ‌రువు త‌గ్గిన హిట్‌మ్యాన్‌

బ‌రువు త‌గ్గిన హిట్‌మ్యాన్‌

గాయం కార‌ణంగా బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ అకాడ‌మీలో రోహిత్ శ‌ర్మ దాదాపు నెల రోజుల పాటు ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఫిజియోథెర‌పీల స‌మ‌క్షంలో కోలుకుంటూ, త‌న ఫిట్‌నెస్‌పై శ్ర‌ద్ధ పెట్టాడు. ఫిట్‌నెస్ కోసం ప్ర‌తిరోజూ గంట‌ల త‌ర‌బ‌డి శ్ర‌మించాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాలంటే బ‌రువు త‌గ్గాల‌ని ఫిజియోథెర‌పీ సూచించ‌డంతో దానిపై శ్ర‌ద్ధ పెట్టాడు. ఈ క్ర‌మంలో 6 కిలోల బ‌రువు కూడా త‌గ్గాడు. ఈ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ బ‌రువు త‌గ్గిన ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఆ ఫోటోల‌లో హిట్‌మ్యాన్ స్లిమ్‌గా మారిన న్యూలుక్‌తో ఆక‌ట్టుకున్నాడు.

 ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు

ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు

బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ అకాడ‌మీలో రోహిత్ శ‌ర్మకు నేడు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో స‌త్తా చాటిన రోహిత్ త‌న ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. నిర్ణీత స‌మ‌యంలో పూర్తి చేయాల్సి ర‌న్నింగ్‌తో పాటు ఇత‌రత్రా వాటిలో కూడా రోహిత్ శ‌ర్మ పాస‌య్యాడు. దీంతో రోహిత్ శ‌ర్మకు అధికారులు ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ స‌ర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోవ‌డంతో వెస్టిండీస్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే, టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండ‌నున్నాడు.

Team India Test Captain : Doubts On Rohit Sharma's Test Captaincy | Oneindia Telugu
నేడే ఎంపిక‌

నేడే ఎంపిక‌

కాగా వెస్టిండీస్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌కు నేడు సెలెక్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో విఫ‌ల‌మైన ఒక‌రిద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు చోటు ద‌క్క‌డం క‌ష్టంగా మారింది. ముఖ్యంగా స‌ఫారీల ప‌ర్య‌ట‌న‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు జ‌ట్టులో చోటు క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. అలాగే జ‌యంత్ యాద‌వ్‌కు కూడా చోటు క‌ష్ట‌మే అని స‌మాచారం. అంతేకాకుండా టీమిండియా త‌దుప‌రి టెస్టు కెప్టెన్ ఎవ‌ర‌నే దానిపై కూడా నేడు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Story first published: Wednesday, January 26, 2022, 15:42 [IST]
Other articles published on Jan 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+