For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND Vs AUS: తుది జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న గంభీర్, రోహిత్.. పంత్ పై వేటు..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరగబోయే ఐదో టెస్ట్ లో గెలవాలన టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే తుది జట్టు కూర్పుపై జట్టు మేనేజ్ మెంట్ చర్చలు కొనసాగిస్తోంది. ఇండియా ఈ సిరీస్ లో మ్యాచ్ మ్యాచ్ కు మార్పులు చేస్తూనే వచ్చింది. మొదటి మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు. మొదటి మ్యాచ్ లో ధృవ్ జురెల్, పడిక్కల్ ఆడాడు. రెండో టెస్ట్ కు వచ్చేసారికి రోహిత్, శుభ్ మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు.

రెండో టెస్ట్ నుంచి వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, పడిక్కల్ తప్పించారు. మూడో టెస్ట్ కు వచ్చేసారికి అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాను తీసుకున్నారు. హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకున్నారు. నాలుగో టెస్ట్ కు వచ్చేసారికి గిల్ తప్పించి అతన స్థానంలో వాషింగ్టన్ సుందరు తీసుకున్నారు. అయితే రెండు మూడు టెస్ట్ ల్లో బ్యాట్స్ మెన్లు మార్చలేదు. కానీ నాలుగో టెస్ట్ లో శుభ్ మాన్ గిల్ తప్పించారు.

Captain Rohit and coach Gambhir are in talks to finalise the squad for the fifth Test against Australia in Sydney

అయినప్పటికీ భారత్ ఓడిపోయింది. దీంతో ఐదో టెస్ట్ జట్టు కూర్పులో కీలక మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆకాశ్ దీప్ గాయం కారణంగా చివరి టెస్ట్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది స్పష్టత లేదు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ ప్రస్తుతం XIలో రిషబ్ పంత్ స్థానం గురించి చర్చిస్తున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. మెల్ బోర్న్ లో రిషబ్ పంత్ ఆటతీరును మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పబట్టిన తీరు తెలిసిందే.

దీంతో రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ ఈ సిరీస్ లో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 154 పరుగులు చేశాడు. దీంతో అతన్ని తప్పించాలని డిమాండ్ వచ్చింది. అయితే పెర్త్ టెస్ట్ లో ఆడిన ధృవ్ జురెల్ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 11, 1 పరుగులు చేశాడు. అంతే కాకుండా వాషింగ్టన్ సుందర్, జడేజా ల్లో ఒకరిని మాత్రమే తుది జట్టుకు తీసుకునే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్ స్థానంలో రాణాను తీసుకునే అవకాశం ఉంది. లేకుంటే ప్రసిద్ధ్ కృష్ణను కూడా తీసుకునే అవకాశం ఉంది. అతనికి ఈ సిరీస్ లో ఆడే అవకాశం లభించలేదు. పిచ్ పరిశీలించిన తర్వాతే తుది జట్టును ప్రకటిస్తామని కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు.

Story first published: Thursday, January 2, 2025, 11:50 [IST]
Other articles published on Jan 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+