Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందువల్లే ఓడిపోయాం: ప్యాట్ కమిన్స్

AUS vs BAN: డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి బంగ్లాదేశ్ కొత్త చరిత్ర సృష్టించగా.. ఈ ఓటమి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఓ చేదు రికార్డును మిగిల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసి 228 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 284 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.

ఈ ఘోర పరాజయంతో ప్యాట్ కమిన్స్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై రెండు వేర్వేరు ఆసియా జట్ల(భారత్, బంగ్లాదేశ్) చేతిలో టెస్టుల్లో ఓడిపోయిన తొలి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. గతంలో 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా 295 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు డార్విన్ టెస్ట్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో ప్యాట్ కమిన్స్ పేరిట ఈ చెత్త రికార్డు నమోదైంది.

Captain Pat Cummins Breaks Silence After Australia Historic Loss to Bangladesh Full Details Here

2026 సంవత్సరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు తీవ్ర నిరాశను మిగులుస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయి సూపర్-8కు చేరకుండానే ఆసీస్ నిష్క్రమించింది. ఆ తర్వాత జూన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో చేజార్చుకోగా.. ఆపై బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ లోనూ 2-1 తేడాతో తొలిసారి చారిత్రాత్మక ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు టెస్టుల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలవ్వడం ఆస్ట్రేలియా క్రికెట్ ను మరింత ఆందోళనలోకి నెట్టింది.

ఈ పరాజయం అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందిస్తూ.. సన్నాహకాల లోపం వల్ల ఓడిపోయామన్న విమర్శలను తిరస్కరించారు. "మా ప్రాక్టీస్, ప్రిపరేషన్ చాలా బాగున్నాయి. ఓటమికి ఎలాంటి సాకులు చెప్పను. మొదటి రోజు పిచ్‌పై పరిస్థితులను సరిగ్గా ఉపయోగించుకోవడంలో మేము విఫలమయ్యాం. మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం కొంత సమయం ఎక్కువ బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. బంగ్లాదేశ్ బౌలర్లు, బ్యాటర్లు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి మమ్మల్ని దెబ్బతీశారు" అని ప్యాట్ కమిన్స్ విశ్లేషించారు.

రెండో టెస్టుకు ముందు జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. మ్యాచ్ ఇప్పుడే ముగిసిందని.. తమ ప్రదర్శనపై సమీక్షించుకుంటామని ప్యాట్ కమిన్స్ వెల్లడించారు. ఆస్ట్రేలియా జట్టుకు మళ్లీ పుంజుకునే సామర్థ్యం ఉందని, బ్యాటర్లు అంతా కలిసి లోపాలను సరిదిద్దుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మ్యాచ్‍లో 300 టెస్ట్ వికెట్లు పూర్తి చేసుకున్న పేసర్ జోష్ హేజిల్‌వుడ్, రెండో ఇన్నింగ్స్‌లో పోరాటపటిమతో సెంచరీ సాధించిన కామెరాన్ గ్రీన్ ఆటతీరును కమిన్స్ ప్రత్యేకంగా కొనియాడాడు.

Story first published: Sunday, August 16, 2026, 14:25 [IST]
Other articles published on Aug 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+