For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ మరో మైలురాయి: కివీస్‌పై భారత్ గెలుపు

బెంగళూరు: కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌‌లో భాగం సోమవారం జరిగిన నాలుగో వన్డే మ్యాచులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-2తో సిరీస్‌ను సమం చేసింది.

కివీస్ నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్ ను ఇండియా టీమ్ 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మిథాలీ రాజ్ అజేయ అర్ధసెంచరీతో కదం తొక్కింది. 88 బంతుల్లో 10 ఫోర్లతో 81 పరుగులు చేసింది. ఈ క్రమంలో వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని మిథాలీ అందుకుంది. 5వేల పరుగులు దాటిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు సృష్టించారు.

Captain Mithali Raj leads India to 8-wicket win; series level at 2-2

స్మృతి మంధన(66) కూడా అర్ధసెంచరీతో రాణించింది. కామిని 31, కౌర్ 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది.

నిరంజన 3, గైక్వాడ్ 3, కౌర్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్‌లో రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచాయి. చివరి మ్యాచ్ బుధవారం జరుగుతుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+