Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా తొలి టెస్టు: హాజారే, గవాస్కర్ సరసన విరాట్ కోహ్లీ శతకం.. ధోనిని అధిగమించాడు

అడిలైడ్: భారత్ - అస్టేలియా మధ్య అడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించిన మూడో అటగాడిగా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. గతంలో విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్‌లు ఇద్దరూ కూడా తొలి టెస్టులోనే సెంచరీలు నమోదు చేశారు.

ఆస్టేలియాలో పర్యటనలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కి ధోని గాయం కారణంగా దూరమవ్వడంతో... కెప్టెన్‌గా బాధ్యతలను విరాట్ కోహ్లీ స్వీకరించాడు. అడిలైడ్ ఓవల్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ 158 బంతుల్లో 101 పరుగులు సాధించాడు.

ఢిల్లీ ఆటగాడైన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐతే దిలిప్ వెంగ్ సర్కార్ కూడా తన తొలి కెప్టెన్సీ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

Captain Kohli matches Gavaskar, overtakes Dhoni

మరోవైపు మహేంద్ర సింగ్ ధోని టెస్టుల్లో చేసిన శతకాలను కూడా విరాట్ కోహ్లీ అధిగమించాడు. మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు 88 టెస్టు మ్యాచ్‌లు ఆడి 6 శతకాలు చేయగా.. విరాట్ కోహ్లీ 30 టెస్టు మ్యాచ్‌ల్లో 7 శతకాలను సాధించాడు.

ప్రస్తుతం టీమిండియా జట్టులో టెస్టుల్లో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ కావడం విశేషం. ఆ తర్వాత స్ధానాల్లో సంయుక్తంగా ఛటేశ్వర్ పుజారా, ధోని ఇద్దరూ 6 శతకాలు సాధించారు. మిచెల్ జాన్సన్ వేసిన బౌన్సర్‌ను ఫోర్ లైన్‌కు తరలిస్తుండగా... 115 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.

తొలి టెస్టు మూడో రోజైన ఈరోజు మురళీ విజయ్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీకి అనుకోకుండా జాన్సన్ షార్ట్ పిచ్ బంతి డెలివరీ చేశాడు. ఈ బంతి ఒక్కసారిగా విరాట్ కోహ్లీ హెల్మెట్‌కు తగిలింది. దీంతో ఫీల్డర్లతో పాటు బౌన్సర్ విసిరిన జాన్సన్ కూడా కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. బౌన్సర్ దెబ్బతో కాస్త ఇబ్బంది పడ్డా హెల్మెట్ తీసిన కోహ్లీ తనకేమీ కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

టెస్టు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీకి ఇది ఏడో శతకం. నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ శతకం సాధించి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో అజ్యంకె రహానే, ఛటేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు అర్ధ సెంచరీలు చేశారు.

కెప్టెన్‌గా తొలి టెస్టులో శతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్:

* 164* ఇంగ్లాండ్‌ జట్టుపై విజయ్ హాజారే ఢిల్లీలో (1951)
* 116 న్యూజిలాండ్ జట్టుపై సునీల్ గవాస్కర్ అక్లాండ్‌లో (1976)
* 102 వెస్టిండిస్ జట్టుపై దిలిప్ వెంగ్ సర్కార్ ఢిల్లీలో (1987) తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో శతకం
* 115 ఆస్టేలియా జట్టుపై విరాట్ కోహ్లీ, అడిలైడ్‌లో (2014)

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+