Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: అందరూ అడుగుతున్నారు కదా.. ఇదిగో చూడండి.. కోహ్లీ ఇంట్లోనే ఉన్నాడు!!

Captain Kohli is in the house: Royal Challengers Bangalore brutally trolls Fans on Twitter

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నెల రోజుల ముందుగానే అన్ని జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి.‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గురువారం దుబాయ్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగుపెట్టాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం వెళ్లే అవకాశం ఉంది.

కింగ్ కోహ్లీ ఎక్కడ:

శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కూడా యూఏఈ వెళ్లగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఏఒక్క ఫొటోలో కూడా ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కనించలేదు. దీంతో కోహ్లీ ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోహ్లీ ఫోటోలలో లేకపోవడంతో.. 'కింగ్ కోహ్లీ ఎక్కడ', 'కోహ్లీ కనిపించడం లేదు', 'విరాట్ మీతో రావడం లేదా', 'ఎం కెప్టెన్ ఎక్కడ', 'కోహ్లీ ప్రత్యేక విమానంలో వస్తున్నాడా' అని ఆర్‌సీబీ అభిమానులు ప్రశ్నలు సంధించారు. దీంతో ఫొటోలు షేర్ చేసిన ఆటగాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

కోహ్లీ ఇంట్లో ఉన్నాడు:

కోహ్లీ ఇంట్లో ఉన్నాడు:

ఈ ప్రశ్నలపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రాంచైజీ స్పందించింది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విరాట్ కోహ్లీ ఫొటోను షేర్‌ చేసి 'మీరు అందరూ అడుగుతున్నారు!.. ఇక్కడ చూడండి. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఇంట్లో ఉన్నాడు!!' అని ట్వీట్‌ చేసింది. అయితే అంతకుముందు విరాట్‌ తన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. 'హలో దుబాయ్‌' అని రాసుకొచ్చాడు. అదే ఫొటోను ఆర్‌సీబీ షేర్‌ చేసింది. దీంతో కోహ్లీ మిగతా ఆటగాళ్ల కంటే ముందే యూఏఈ చేరుకున్నాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

చార్టర్‌ ఫ్లైట్స్‌లో కోహ్లీ:

విరాట్ కోహ్లీ దుబాయ్ వెళ్లడానికి ప్రత్యేక చార్టర్‌ను బుక్ చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఆర్‌సీబీ బృందం శుక్రవారం బెంగళూరు నుంచి యూఏఈ వెళ్లింది. కానీ కోహ్లీ జట్టుతో పాటు వెళ్లలేదట. ముంబై నుంచి ఎక్స్‌క్లూజివ్ చార్టర్ విమానంలో భారత కెప్టెన్ యూఏఈ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్‌సీబీ జట్టు వెళ్లిన తర్వాతే కోహ్లీ దుబాయ్ వెళ్ళాడట. అక్కడ ప్రాంఛైజీ ఏర్పాటు చేసిన హాటోల్లో ఉన్నాడని తెలుస్తోంది. దుబాయ్‌లోని వాల్డోర్ఫ్ హోటల్లో ఆర్‌సీబీ బస చేస్తోంది.

బాల్కనీల్లో ముచ్చట్లు:

బాల్కనీల్లో ముచ్చట్లు:

ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌ వెళ్లిన క్రికెటర్లు అక్కడ హోటల్లో క్వారంటైన్‌ అయ్యారు. అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్‌ గదులకే పరిమితమైన ఆటగాళ్లు.. అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఇక ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, August 22, 2020, 12:22 [IST]
Other articles published on Aug 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+