Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: కెప్టెన్ అంటే ఇలా ఆడాలి.. ఓటమి ఖాయం అనుకుంటే గెలిపించాడు!

Captain Innings saves Sydney Sixers in BBL

జట్టు ఓటమి అంచున నిలిచినప్పుడు ముందడుగు వేసి గెలిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుంది. బిగ్ బ్యాష్ లీగ్‌లో అదే జరిగింది. సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సిక్సర్స్ విజయం సాధించింది. స్పాట్‌లెస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సిక్సర్స్ సారధి మోజెస్ హెన్రిక్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయం సరైందేనని పేసర్ షాన్ ఆబాట్ నిరూపించాడు.

ఆబాట్ తను వేసిన నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. దీంతో థండర్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. శామ్ వైట్‌మాన్ (42), అలెక్స్ రోస్ (34), బెన్ కటింగ్ (26 నాటౌట్) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరగా.. మాథ్యూ గైక్స్ (7), ఆలివర్ డేవిస్ (0), డానియల్ శామ్స్ (5), నాథన్ మెక్ఆండ్రూ (9), క్రిస్ గ్రీన్ (2), బ్రెండన్ డాగెట్ (1 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో థండర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో సిక్సర్స్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు జోష్ ఫిలిప్ (6), జేమ్స్ విన్స్ (5)తోపాటు కర్టిస్ పీటర్సన్ (2) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హెన్రిక్స్ (53 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి జతకలిసిన జోర్డాన్ సిల్క్ (59 నాటౌట్) కూడా సత్తా చాటాడు. దీంతో వీళ్లిద్దరూ కలిసి సిక్సర్స్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో సిక్సర్స్ 16.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంతితో థండర్ పతనాన్ని శాసించిన షాన్ ఆబాట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, January 8, 2023, 19:47 [IST]
Other articles published on Jan 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+