Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుజరాత్ వర్సెస్ కోల్‌కతా ‌మ్యాచ్ తుది జట్లు ఇవే..! కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి..

captain hardik pandya in makes gujarath titans strong with kkr match

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం మధ్యాహ్నం 3:30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో గెలిచింది నాలుగు మ్యాచ్‌లలో ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ దీటుగా పోరాడినా చివరికి ఓడిపోయింది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీంగా కొనసాగుతోంది. మంచి విజయాలను అందుకుంటుంది. చెన్నైతో జరిగిన చివరి మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించడంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 2స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి టాప్ 1స్థానంలోకి వెళ్లాలని చూస్తోంది. అలాగే గుజరాత్ నెట్‌రన్ రేట్ (+0.392) కూడా బాగుంది.

పింఛ్ కొనసాగే అవకాశం..

పింఛ్ కొనసాగే అవకాశం..

గత మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్ ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో అతన్ని ఈ మ్యాచ్‌లోనూ ఆడించే అవకాశం ఉంది. అలాగే శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో తన కెప్టెన్ ఇన్సింగ్స్‌తో జట్టుకు న్యాయం చేస్తున్నాడు. ఇక వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్ విషయంలోనూ కేకేఆర్ పటిష్టంగా కన్పిస్తోంది. పాట్ కమిన్స్ మరింత తన ఫామ్ అందుకోవాల్సి ఉంది.

టాప్ ఆర్డర్ గుజరాత్‌కు కీలకం..

టాప్ ఆర్డర్ గుజరాత్‌కు కీలకం..

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గత మ్యాచ్‌కు దూరం కాగా రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్ విభాగం ఇంకాస్త పటిష్ఠం కానుంది. అయితే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ పుంజుకోవాల్సిన అవసరముంది. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఫెర్గూసన్ లాంటి మేటి బౌలర్లు మంచి ఫామ్ లో ఉండడంతో‌పాటు మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేస్తున్నారు.

తుది జట్ల అంచనా..

తుది జట్ల అంచనా..

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), షెల్డన్ జాక్సన్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

Story first published: Saturday, April 23, 2022, 10:40 [IST]
Other articles published on Apr 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+