For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల వర్షం.. సిక్సర్లతో 102 పరుగులు (వీడియో)

ICC Cricket World Cup 2019 : Eoin Morgan Record Breaking 17 Sixes Against Afghanistan || Oneindia
Captain Eoin Morgan smashes 17 sixes againest Afghanistan, Breaks World Record In Manchester, Video


ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం అఫ్గాన్‌తో జరిగిన పోరులో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు) సెంచరీ చేసాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో 102 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి అంటే అతను ఎంత విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బౌలర్‌ చేతి నుంచి బంతి పడిందే ఆలస్యం.. అది స్టాండ్స్‌కు వెళ్లాల్సిందే అన్నట్టుగా మోర్గాన్ విరుచుకుపడ్డాడు. అతడి విధ్వంసానికి పసికూన అఫ్ఘానిస్థాన్‌ ఏమీ చేయలేని స్థితిలో నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 సిక్సర్లతో వన్డేల్లో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 17 సిక్సర్లు బాదిన మోర్గాన్.. వన్డేల్లో అత్యధిక సిక్సులు (17 సిక్సులు) బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అంతకుముందు రోహిత్ శర్మ (16), వాట్సన్ (16), క్రిస్ గేల్ (16), ఏబీ డివిలియర్స్ (16) సిక్సుల రికార్డు బద్దలైంది.

మోర్గాన్ బాదుడుకు ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ దారుణంగా పరుగులు ఇచ్చాడు. 9 ఓవర్లలో 110 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ అందరూ కలిసి 11 సిక్సర్లు బాదితే.. మోర్గాన్‌ ఒక్కడే 7 సిక్సర్లు బాదాడు. మరి ఇంతలా విరుచుకుపడ్డ మోర్గాన్ సిక్సర్లను చూడాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు ఓ లుక్కేద్దాం.

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో హష్మతుల్లా (74), రహ్మత్‌ (46), అఫ్గాన్‌ (44) మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, రషీద్‌ తలో మూడు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్ (148), బెయిర్‌ స్టో (90: 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌ (88: 82 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌), మొయిన్‌ అలీ (31: 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) చెలరేగారు.

Story first published: Wednesday, June 19, 2019, 8:48 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+