హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బుధవారం ఘనంగా సన్మానించింది. ఇన్నాళ్లు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన ధోనికి ఓ వినూత్న జ్ఞాపికను బహుకరించారు. చెక్కతో రూపొందించిన ఆ జ్ఞాపికకు నాలుగు సిల్వర్ స్టార్లు అతికించి అతడికి బహుమతిగా ఇచ్చారు.
ఈ నాలుగు స్టార్లు ధోని నాయకత్వంలో భారత్ సాధించిన నాలుగు అద్భుత విజయాలకు సూచికలని టీమిండియా తెలిసింది. ధోని నేతృత్వంలోని టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2009లో టెస్టుల్లో నంబర్‌వన్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసందే.

ఈ నాలుగు ట్రోఫీలను గుర్తుకు తెచ్చే విధంగా నాలుగు సిల్వర్ స్టార్లను తీర్చిదిద్దారు. మూడో టీ20కి ముందు బెంగుళూరులో టీమిండియా బస చేసిన హోటల్లో జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ థ్యాంక్ నోట్‌ను కూడా చదవి వినిపించారు.
మహీ అందరికీ స్ఫూర్తిదాయకం. కెప్టెన్ పర్ ఎక్సలెన్స్ అని దీనికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.