INDvsAUS : వాడే ఆసీస్ రాత మార్చాడు.. స్టార్ ప్లేయర్‌పై మాజీ దిగ్గజం ప్రశంసలు!

భారత్‌ను మూడో టెస్టులో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియాపై మాజీ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసీస్ అద్భుతమైన క్రికెట్ ఆడిందని, అందుకే గెలిచిందని మెచ్చుకుంటున్నారు. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం, టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ప్రశంసలు కురిపించాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఒకప్పటి బలమైన ఆసీస్‌లా ఆడిందని మెచ్చుకున్నాడు.

ఆసీస్ కొత్తగా కనిపించింది..
'ఈ టెస్టు మ్యాచ్ అంత వరకు ఆస్ట్రేలియా అద్భుతమైన క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా ఎలా ఆడాలో అలా ఆడింది. ఇంతకుముందు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన జట్టులా కనిపించలేదు. ఆ టీం కెప్టెన్ మారగానే ఆ జట్టు వాతావరణం అంతా మారిపోయినట్లు అనిపించింది' అని భజ్జీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడలేదు. తల్లికి అనారోగ్యం చేయడంతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు ఈ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అతను జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు.

భళా కెప్టెన్..
'స్మిత్ కెప్టెన్సీ బ్రిలియంట్‌గా ఉంది. తన దగ్గర ఉన్న స్పిన్నర్లను చాలా బాగా ఉపయోగించుకున్నాడు. భారత్ టాస్ గెలిచినా కూడా మ్యాచ్‌లో ప్రతి సెషన్‌లో ఆసీస్ పైచేయి సాధించింది. మొదటి రోజు నుంచే అద్భుతమైన బౌలింగ్‌తో వికెట్లు తీసి భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి పెంచారు' అని హర్భజన్ కొనియాడాడు. అదే సమయంలో భారత బ్యాటర్ల ఆటతీరు మాత్రం తనకు పెద్దగా నచ్చలేదన్నాడు. కొందరు ఆటగాళ్ల షాట్ సెలెక్షన్ ఏమాత్రం బాగలేదని కరాఖండీగా చెప్పేశాడు. అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారని అసంతృప్తి వ్యక్తంచేశాడు.

భారత బ్యాటర్ల చెత్త షాట్లు.
.
'భారత జట్టులో కొందరు ఆడిన షాట్లు నాక్కూడా నచ్చలేదు. అనవసరంగా వికెట్ పారేసుకున్నట్లు అనిపించింది. మొదటి రోజునే భారీగా పరుగులు చేసేయాలనే తపనతో ఇలా అవుటైనట్లు కనిపించింది. అక్కడే మ్యాచ్‌పై పట్టు ఎలా బిగించాలో స్టీవ్ స్మిత్‌కు అర్థమైంది' అని భజ్జీ చెప్పాడు. అలాగే ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఆడుతుంటే ఒకప్పటి బలమైన ఆసీస్ జట్టు కనిపించిందన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో తమ ఇంటెంట్ చూపించిందని చెప్పాడు. ప్రతి పరుగు కీలకమే అనే స్థితిలో కూడా ఆధిపత్యం చెలాయించారని, పాతరోజులు గుర్తు చేశారని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications