Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ. 5 లక్షల నజరానా

హైదరాబాద్: మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆదివారం పంజాబ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌‌లో కౌర్‌ 20 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

హర్మన్ ప్రీత్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్‌ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌర్‌ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్‌ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు.

అంతేకాదు కౌర్‌ మరో అద్భుత ప్రదర్శనతో వరల్డ్‌ కప్‌ సాధిస్తుందని, కెరీర్‌లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె తండ్రి హర్మందర్‌ సింగ్‌కు అభినందనలు తెలిపారు. కౌర్‌ తల్లిదండ్రులను తన వద్దకు పిలిపించుకొని ఆయన ఆదివారం అభినందించారు.

Captain Amarinder Singh Announces Rs. 5 Lakh Reward For Harmanpreet Kaur

ఈ సందర్భంగా హర్మన్‌‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌ మహిళల జట్టు వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ అందర్ని గర్వించేలా చేసిందని, ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ చెప్పారు.

గతంలో ప్రకాశ్‌సింగ్ బాదల్ సారథ్యంలోని ప్రభుత్వం హర్మన్‌ప్రీత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిందనీ ఈ సందర్భంగా సీఎం అమరీందర్ ఆరోపించారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+