David Warner‌ను తొలిసారి చూసినప్పుడు వీడెవడ్రా ఇంత మొరటుగా ఉన్నాడనుకున్నా: క్యాండీస్ వార్నర్

David Warner Arrogant అప్పటికే వార్నర్ కి గర్ల్ ఫ్రెండ్.. వీడెవడ్రా ఇంత మొరటుగా Candice

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కరోనా కష్టాలన్నిటిని ధాటి ఇటీవలే ఇంటికి చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ అర్థారంతంగా వాయిదా పడటంతో ఇతర దేశాల ఆటగాళ్లంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరగా.. ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం చుక్కలు చూశారు. ఆ దేశ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలతో సుమారు 25 రోజుల పాటు క్వారంటైన్‌లోనే గడిపారు. మాల్దీవుల్లో ఓ పది రోజులు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మరో 15 రోజులు క్వారంటైన్‌లో ఉండి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ రాక కోసం అతని కుటుం సభ్యులు వెయ్యికళ్లతో ఎదురు చూశారు.

రోజులు లెక్కపెట్టారు..

రోజులు లెక్కపెట్టారు..

కరోనాతో అల్లాడుతున్న భారత్‌లో చిక్కిపోయిన తన భర్త పట్ల వార్నర్ సతీమణి క్యాండిస్, పిల్లలు ఆందోళనకు గురయ్యారు. క్యాలెండర్‌లో రోజులు లెక్కపెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ ఆసీస్ ఓపెనర్ ఇంటికి చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా క్యాండిస్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక వార్నర్-క్యాండీస్‌లది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు ఇంత ప్రేమను చూపించుకుంటున్న ఈ జంట.. ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగినా ఒకరికొకరు తెలియదంట. ఈ విషయాన్నే క్యాండిసే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

వీడెవడ్రా..

వీడెవడ్రా..

అంతేకాకుండా వార్నర్‌ను తొలిసారి చూసినప్పుడు వీడెవడ్రా ఇంత మొరటుగా ఉన్నాడని అనుకున్నానని, అస్సలు అతనిపై ఎలాంటి ఇంప్రెషన్ కలగలేదని తెలిపింది. ‘మా వివాహానికి రెండేళ్ల ముందు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మేం తొలిసారి కలుసుకున్నాం. అప్పడు నేను ఆస్ట్రేలియాలో ప్రాచుర్యం పొందిన సీటీ2సర్ఫ్ మారథన్ రన్ పూర్తి చేశాను. నా ఫ్రెండ్ పక్కన ఉన్న వార్నర్ చాలా మొరటుగా కనిపించాడు. ఏ మాత్రం స్నేహపూర్వకంగా ఉంటాడనిపించలేదు. మాములుగా హాలో మాత్రమే చెప్పుకున్నాం. అతనో అహంకారి, మొరటు వ్యక్తి అనే భావన నాలో కలిగింది. అయితే అప్పటికే అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది'అని క్యాండిస్ చెప్పుకొచ్చింది.

 సోషల్ మీడియా చాటింగ్..

సోషల్ మీడియా చాటింగ్..

ఇక వార్నర్‌ను టీవీల్లో చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అతనికి తాను మేసేజ్ చేశానని క్యాండిస్ గుర్తు చేసుకుంది. అలా మొదలైన తమ ప్రేమ.. వివాహానికి దారితీసిందని చెప్పుకొచ్చింది. ‘ఆరంభంలో వార్నర్‌పై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అయితే ఓసారి టీవీలో అతన్ని చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేశా. అలా పరిచయం ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది'అని క్యాండిస్ చెప్పుకొచ్చింది. 2015లో వివాహం చేసుకున్న ఈ జంటకు ముగ్గురు ఆడ పిల్లలు. ఇవీ మే, ఇండిరే, ఇస్లా రోస్. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్న వార్నర్.. వెస్టిండీస్ పర్యటనతో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.

మ్యాచ్‌కు ముందు కూడా చేస్తాడు..

మ్యాచ్‌కు ముందు కూడా చేస్తాడు..

గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ లైంగీక జీవితంపై కూడా క్యాండిస్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘ది కైల్ అండ్ జాకీ ఓ' షో‌లో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ‘ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అతను కావాలనుకుంటే చేస్తాడని, లేకుంటే లేదని తెలిపింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే నిబంధనతో అయితే ఏమి ఉండడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త ఈ విషయంలో చాలా సమర్థుడని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 4, 2021, 15:16 [IST]
Other articles published on Jun 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X