Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎయిర్‌‌పోర్టులో గంజాయితో పట్టుబడిన స్టార్ క్రికెటర్

Nicholas Kirton Arrested: భారత్‌లో ఐపీఎల్ 2025 జోరుగా సాగుతున్న తరుణంలో బార్బడోస్ లో ఓ స్టార్ క్రికెటర్ అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచింది. కెనడా జట్టు స్టార్ క్రికెటర్, కెప్టెన్ అయిన నికోలస్ కిర్టన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బార్బడోస్ లోని గ్రాంట్లీ ఆడమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నికోలస్‌ను అరెస్ట్ చేశారని.. అతని వద్ద 9 కిలోల గంజాయి దొరికిందని జమైకా గ్లీనర్ నివేదించింది. మీడియా నివేదిక ప్రకారం నికోలస్ కిర్టన్ 20 పౌండ్ల(సుమారు 9 కిలోలు) గంజాయిని మోసుకెళ్తున్నాడని తెలిసింది. సమాచారం ప్రకారం కెనడాలో 57 గ్రాముల వరకు గంజాయిని కలిగి ఉండడం నేరంగా పరిగణించబడదు. కానీ దానిని బహిరంగంగా తీసుకెళ్లడం అనుమతించబడదు. నికోలస్ కిర్టన్ అనుమతించబడిన పరిమితి కంటే 160 రెట్లు ఎక్కువ గంజాయిని తీసుకెళ్తున్నట్లు తేలింది. దాని కారణంగా అతడిని అరెస్ట్ చేశారు.

నికోలస్ మళ్లీ జట్టులో భాగమవుతాడా?
నికోలస్ కిర్టన్ అరెస్ట్ తర్వాత మళ్లీ కెనడియన్ జట్టులో భాగం కాగలడా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నికోలస్ కిర్టన్ నార్త్ అమెరికా కప్‌లో ఆడే అవకాశాలు గణనీయంగా తగ్గాయి. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కానుంది. నార్త్ అమెరికా కప్ లో కెనడా, బహామాస్, బెర్ముడా, అమెరికా, కేమన్ దీవులు ఆడతాయి.

Canadian Star Cricketer Nicholas Kirton Arrested at Airport with Drugs

నికోలస్ కిర్టన్ ఎవరు?
నికోలస్ కిర్టన్ బార్బడోస్ లో జన్మించాడు. అతను ఒక ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా చేస్తాడు. బార్బడోస్ లో జన్మించిన నికోలస్ అండర్-17, అండర్-19 స్థాయిలో వెస్టిండీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ అతను వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు. నికోలస్ కిర్టన్ తల్లి కెన‌డాకు చెందినది. కాబట్టి అతను కెనడియన్ అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు ఆడటానికి అర్హత పొందాడు. ఫిబ్రవరి 2018లో ఒమన్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గత ఏడాది జులైలో అన్ని ఫార్మాటల్లో నికోలస్ కిర్టన్ కెనడా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. నికోలస్ కిర్టన్ తన అంతర్జాతీయ కెరీర్ లో ఇప్పటి వరకు 21 వన్డేలు ఆడి 514 పరుగులు చేశాడు. 28 టీ20 మ్యాచ్‌ల్లో 627 పరుగులు చేశాడు. వీటిలో అన్ని ఫార్మాట్లలో ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, April 4, 2025, 16:00 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+