For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై!

టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశ ముగియడంతో అనేక జట్ల ప్రయాణం ముగిసింది. ఈ క్రమంలో కెనడా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెటర్, మాజీ కెప్టెన్ నవనీత్ ధలివాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్గనిస్థాన్ జట్టుతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ తర్వాత ఆయన తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు.

కెనడా క్రికెట్ 'పరుగుల యంత్రం'
37 ఏళ్ల నవనీత్ ధలివాల్ కెనడా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన కెరీర్లో 48 టీ20 మ్యాచ్‌ల్లో 1305 పరుగులు సాధించాడు. కేవలం బ్యాటర్‌‌‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఆయన జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఆయన నాయకత్వంలో కెనడా 29 టీ20ల్లో ఏకంగా 21 విజయాలను అందుకోవడం విశేషం.

Canada Legend Navneet Dhaliwal Announces Retirement After T20 World Cup 2026 Full Details

గుర్తుండిపోయే క్షణాలు
రిటైర్మెంట్ సందర్భంగా నవనీత్ ధలివాల్ తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. "2024 టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించడం, ఆ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లోనే (అమెరికాపై) 61 పరుగులతో రాణించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గర్వకారణమైన క్షణాలు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత 2026 ప్రపంచకప్‌లో కూడా దక్షిణాఫ్రికాపై 64 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు.

శుభ్‌మన్ గిల్‌తో అనుబంధం
నవనీత్ ధలివాల్ అసలు ఊరు పంజాబ్‌లోని మొహాలీ. అక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న నవనీత్ ధలివాల్.. ఆ తర్వాత కెనడాకు వెళ్లారు. రిటైర్మెంట్ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చిన్న వయసులో ఉన్నప్పుడు.. గిల్ తండ్రి కోరిక మేరకు ధలివాల్ అతనికి బౌలింగ్ చేసి ప్రాక్టీస్ చేయించేవారట. ఆ రోజుల్లోనే గిల్ టెక్నిక్ చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు.

కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్
క్రికెట్ మైదానం వీడినా, ఈ క్రీడతో తనకున్న బంధాన్ని నవనీత్ ధలివాల్ కొనసాగించనున్నాడు. కెనడాలో అట్టడుగు స్థాయిలో యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు కోచింగ్ వైపు వెళ్తానని ఆయన ప్రకటించాడు. 19 ఏళ్ల యువ ఆటగాడు యువరాజ్ సామ్రా వంటి వారు న్యూజిలాండ్‌పై సెంచరీ బాదడం చూస్తుంటే కెనడా క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని తాను నమ్ముతున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా క్రికెట్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టిన నవనీత్ ధలివాల్ రిటైర్మెంట్ ఆ జట్టుకు పెద్ద లోటే. మరి ఆయన కోచ్‌గా కెనడాకు ఎలాంటి నూతన తరాన్ని అందిస్తారో చూడాలి.

Story first published: Friday, February 20, 2026, 9:00 [IST]
Other articles published on Feb 20, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+