Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి.. ఈ ఆటగాళ్లు ఆ ధరకు న్యాయం చేయగలరా?

Can these players satisfy their price tag in IPL 2023

కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ మినీ వేలం అద్భుతంగా జరిగింది. కొంత మంది ఆటగాళ్లు ఊహించని రీతిలో భారీ ధర పలికారు. వేలం ప్రారంభానికి ముందు అనుకున్నట్లే ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు చాలా గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన కొందరు ఆటగాళ్లు.. వచ్చే ఏడాది తమ ధరకు న్యాయం చేస్తారా? అనేది ప్రశ్నగా మారింది. ఇలా భారీ ధర పలికిన కొందరు ఆ ధరకు న్యాయం చేయడం కష్టంగా కనిపిస్తోంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒకసారి పరిశీలిస్తే..

కామెరూన్ గ్రీన్

కామెరూన్ గ్రీన్

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్. ఈ ఆసీస్ యువ కెరటం భారత పర్యటనలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా రాణించాడు. అయితే అతన్ని ముంబై జట్టు లెజెండరీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ స్థానంలో తీసుకుంది. ఈ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడా? అనేది అనుమానమే. ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో గ్రీన్ రికార్డు అంతంతమాత్రమే. దానికితోడు అసలు ఐపీఎల్‌లో ఎలాంటి ప్రెజర్ ఉంటుందనే విషయం కూడా అతనికి తెలీదు. అంతేకాదు భారీ ధరకు ముంబై కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఆ సీజన్‌లో తేలిపోవడం కూడా షరా మామూలే. గతేడాది ఇషాన్ కిషన్ విషయంలో కూడా అదే జరిగింది.

నికోలస్ పూరన్

నికోలస్ పూరన్

గతేడాది సన్‌రైజర్స్ తరఫున నికోలస్ పూరన్ పెద్దగా రాణించలేదు. అతన్ని రూ.12 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. ఆ ధరకు పూరన్ న్యాయం చేయలేకపోయాడని భావించింది. అందుకే మినీ వేలానికి ముందే అతన్ని విడుదల చేసింది. ఈసారి అతనికి అంత ధర రాదని అంతా అనుకున్నారు. అయితే గతేడాది కన్నా ఎక్కువ ధరకు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. పూరన్ కోసం ఏకంగా రూ.16 కోట్లు ఖర్చు చేసింది. ఇటీవల ముగిసిన అబుధాబి టీ10 లీగులో పూరన్ బాగానే రాణించాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ఫామ్ చాలా చెత్తగా ఉంది. ఈ ఏడాది 47 టీ20 మ్యాచుల్లో 26.91 సగటు, 132.8 స్ట్రైక్‌ రేటుతో మాత్రమే పరుగులు చేశాడు. దానికితోడు అతని అత్యుత్తమ స్కోరు 74 పరుగులు. అలాంటి వాడు తన భారీ ధరకు న్యాయం చేయడం కష్టంగా కనిపిస్తోంది.

బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్

మినీ వేలంలో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీగా ఖర్చు చేయడమే. సాధారణంగా సీఎస్‌కే యాజమాన్యం అంత భారీ ఖర్చు చేయదు. కానీ స్టోక్స్ కోసం రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఈ ధరకు అతను న్యాయం చేస్తాడా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే బ్యాటింగ్‌లో స్టోక్స్‌కు టాపార్డర్‌ అచ్చొచ్చింది. కానీ చెన్నై టాపార్డర్‌లో ఖాళీ లేదు. అలాగే డ్వేన్ బ్రావో లేని లోటును పూడ్చేందుకు డెత్ ఓవర్లలో కూడా స్టోక్స్ సేవలు వినియోగించుకోవాలనేది చెన్నై ప్లాన్. అయితే డెత్ ఓవర్లలో స్టోక్స్ అంత గొప్ప బౌలర్ కాదు. దీంతో తనకు దక్కిన భారీ ధరకు న్యాయం చేయడానికి స్టోక్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, December 28, 2022, 19:19 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+