
మరో 4 రోజుల్లో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. టీమిండియా ఈ నెల 1 నుంచి క్వారంటైన్‌లో కూడా ఉంది. 6 నుంచి జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఈ సమరానికి తెరలేవనుంది. హిట్‌మ్యాన్ రోహిత్ పరిమిత్ ఓవర్ల పార్మాట్‌కు కెప్టెన్ అయిన తర్వాత ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం రోహిత్ శర్మ మళ్లీ క్రికెట్ ఆడలేదు. కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోగా.. గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. ఇలా చూస్తుండగానే రోహిత్ శర్మ క్రికెట్ ఆడి 3 నెలలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో విండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం హిట్‌మ్యాన్ ఆతురతగా ఎదురుచూస్తున్నాడు. విండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా 6, 9,11వ తేదీల్లో 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక కోల్‌కతా వేదికగా 16, 18, 20వ తేదీల్లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌లో క్వారంటైన్‌లో ఉన్న రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో ఇండియా జెర్సీలో, బ్యాట్ పట్టుకోని, మైదానంలో హిట్‌మ్యాన్ వెనుక వైపుగా నిలబడి ఉన్నాడు. ఆ ఫోటోలో హిట్‌మ్యాన్ జెర్సీ నంబర్ 45 హైలేట్ అవడం మనం గమనించవచ్చు. కాగా తన 3 నెలల క్రికెట్ విరామాన్ని గుర్తు చేసుకుంటూ ''ప్రారంభానికి ముందు ఇలా వేచి ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నాను'' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా విండీస్‌తో ఆడనున్న భారత వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది.
భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్లన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అవేశ్‌ఖాన్.
భారత టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్ పటేల్.