
న్యూ ఢిల్లీ: టీమిండియా ప్రాక్టీసు లోపంతోనే ఓడిపోతుందంటూ పరోక్షంగా జట్టును ఎద్దేవా చేస్తూ.. కోహ్లీతో పోల్చుకోవద్దంటూ సూచనలిస్తున్నాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఇలా టెస్టు సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమైన తీరును మాజీ కెప్టెన్ తప్పు పట్టాడు. వన్డే సిరీస్ పరాజయం తర్వాత భారత ఆటగాళ్లు ఐదు రోజుల విరామం తీసుకుని, ఐరోపాలో విహరించిన నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'టెస్టు సిరీస్‌కు భారత్ ఏమాత్రం సన్నద్ధం కాలేదు. వన్డే సిరీస్ తర్వాత విరామం అవసరమే. కానీ ఏకధాటిన ఐదు రోజులంటే చాలా ఎక్కువ' అని చెప్పాడు. అధికారిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ప్రాక్టీస్ సెషన్లుగా మార్చడం సమంజసం కాదన్నాడు. దీనిపట్ల క్రికెటర్లకు ఇంగ్లాండ్ గడ్డపై గెలవాలనే ఆలోచన మందగిస్తుందని తెలిపాడు. కేవలం మ్యాచ్ జరుగుతున్ప్పుడే గెలిచేందుకు తాపత్రయపడుతున్నారని ప్రాక్టీస్ సెషనల్లో ఇలాంటిది కనిపించదని తెలిపాడు.
'భారత జట్టు కనీసం రెండు మూడు రోజుల మ్యాచ్‌లు.. సరైన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సింది. 18 మంది కాకుండా 11 మందినే ఆడించాల్సింది' అని చెప్పాడు. సరైన సన్నాహం లేనప్పుడు ఇంగ్లాండ్‌లో నెల రోజులున్నా ప్రయోజనం లేదన్నాడు. సన్నాహం విషయంలో మిగతావాళ్లు కోహ్లిని అనుసరించరాదన్నాడు. ఆఖరిసారి జరిగిన వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కోహ్లీ మానసికంగా కూడా సిద్దపడ్డాడని మిగిలిన వారికి ఇంగ్లాండ్ గడ్డపై ఇంకా పట్టు లభించలేదని తెలిపాడు.
ఈ క్రమంలో.. 'కోహ్లి 50 రోజుల విరామం తీసుకున్నా, వచ్చిన వెంటనే సెంచరీ కొట్టగలడు. కానీ ఇతరులకు ప్రాక్టీస్ అవసరమన్న విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ గుర్తించాలి' అని గవాస్కర్ చెప్పాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కూడా ఇరు జట్ల ఆటగాళ్లకు నాలుగు రోజుల విరామం వచ్చింది. ఐదో రోజు మ్యాచ్ ఆడనున్నారు.